చీర కట్టుకుని క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్..

mithali raj playing cricket in sari
Spread the love

మిథాలీరాజ్ చీర కట్టుకొని క్రికెట్‌ ఆడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారిందని ‘ఈనాడు‘ కథనం తెలిపింది.ఈ వీడియోను మిథాలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.కట్టుబాట్లు తెంచుకుని అమ్మాయిలు ఎదుగుతున్నారని చెప్పడానికి ఆమె చీరకట్టులో క్రికెట్‌ ఆడారు.మహిళా క్రికెట్‌లో సచిన్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్.ఇండియన్ విమెన్ క్రికెట్ టీంని ఎక్కువ కాలం కెప్టెన్ గా నడిపించిన ఘనత ఆమె సొంతం విమెన్ క్రికెట్ కి ఎలాంటి ప్రాధాన్యత లేని రోజుల నుంచి ఇప్పుడు మెన్స్ క్రికెట్ తో సమానమైన గుర్తింపు తీసుకొచ్చే వరకు ఆమె ప్రయాణం కొనసాగింది.

 

mithali raj playing cricket in sari
mithali raj playing cricket in sari

’20+ ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌. ఎదుర్కోని ఆటుపోట్లు లేవు. పడని కష్టం లేదు. పురుషుల క్రికెట్‌ నీడలో ఎదిగి దిగ్గజంగా మారింది మిథాలీరాజ్‌. భారత మహిళల క్రికెట్‌ జట్టు సారథిగా ఆమె కీర్తి ఆకాశాన్ని తాకింది. కట్టుబాట్లను దాటి అమ్మాయిల ఆటకు దశ, దిశ చూపించింది. ఖేల్‌ రత్న, పద్మశ్రీ పురస్కారాలను అందుకుంది. కాగా ఆమె చీరకట్టుకొని క్రికెట్‌ ఆడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సాధారణంగా క్రికెట్‌ అంటే జెర్సీ, ప్యాంటు ధరించి ఆడతారని అందరికీ తెలుసు. మరెందుకు మిథాలీ చీరకట్టుకొని ఆడిందనేగా మీ సందేహం.మార్చి 8న అంతర్జాతీయ మహిళల దినోత్సవం. అదే రోజున మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆసీస్‌తో హర్మన్‌ప్రీత్‌ సేన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడనుంది.

 

View this post on Instagram

A post shared by Mithali Raj (@mithaliraj)

 

కట్టుబాట్లను తెంచుకొని అమ్మాయిలు ఎదుగుతున్నారనేందుకు నిదర్శనంగా చీర కట్టుతో ఆమెను క్రికెట్‌ ఆడించారు.

‘టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ను స్వదేశానికి తీసుకురా’ అనే సందేశాన్ని జోడించారు” అని ఆ కథనంలో తెలిపారు.

కమాన్‌ టీమిండియా, ప్రపంచకప్‌ను తీసుకురండి అని పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.చాలా మంది నెటిజన్లు మిథాలీని చూస్తే గర్వంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇదిలా ఉంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే టీం ఇండియా, ఆస్ట్రేలియాతో ఫైనల్ లో పోటీ పడబోతుంది.

మిథాలి రాజ్

వికీపీడియా నుండి

Jump to navigationJump to search

మిథాలి రాజ్
[[Image:

పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న మిథాలి రాజ్

|154px|]]

Flag of India.svg India
వ్యక్తిగత సమాచారం
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు893
పరుగులు5222776
బ్యాటింగ్ సగటు5245.50
100లు/50లు1/32/20
అత్యుత్తమ స్కోరు214114*
ఓవర్లు1264.5
వికెట్లు6
బౌలింగ్ సగటు12.16
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు00
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు0n/a
అత్యుత్తమ బౌలింగ్03/12
క్యాచ్ లు/స్టంపింగులు7/-23/-
As of మార్చి 272007
Source: [1]

1982డిసెంబర్ 3న జన్మించిన మిథాలి రాజ్ (Mithali Raj) భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిల్చింది. 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది. స్వతహాగా బ్యాటింగ్ చేసే మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేసేది. 2003లో ఆమెకు అర్జున అవార్డు పురస్కారం లభించింది. ఆమె చిన్నప్పుడు భారత సాంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యంలో శిక్షణ పొంది వేదికలపై నాట్యం చేసేది. ప్రస్తుతం మిథాలి భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *