కాడి కింద పడేసిన ‘కొత్త పలుకు’..!!!
…………………………………
వై.వి.రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
………………………………..
ఏపీలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు ముందే ఓటమికి టీడీపీ నేతలు ఓటమికి మానసికంగా సిద్ధమయ్యారు. శనివారం చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే ఆయన కూడా ఓటమిని అంగీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘కొత్త పలుకు’ కూడా ముందుగానే ఓటమిని అంగీకరించింది. చంద్రబాబు నాయుడు, కొత్త పలుకు ఏడుపంతా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ మీదనే. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాస్వామ్యప్రియులు ఆహ్వానిస్తున్నారు. కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం..ఎన్నికల్లో ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు నిర్ధారణ అయితే వారిపై క్రిమినల్ కేసులు పెడతారు. ఈ తరువాత జైలుకు పంపుతారు. డబ్బు, మద్యంతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ కలుషితమైంది. దేశం మొత్తం మీద ఏపీలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు . ఎన్నికలంటే మద్యం ఏరులై పారేది. డబ్బులు కట్టలు తెంచుకుని ప్రవహించేవి. డబ్బు, మద్యంతో ఎన్నికలను, ప్రజాస్వామ్య వ్యవస్థను కలుషితం చేసింది చంద్రబాబే. 1995లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన కొత్తలో ప్రకాశం జిల్లాలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికలో విజయం సాధించడం చంద్రబాబుకు చాలా అవసరం. భారత ఎన్నికల చరిత్రలోనే రూ.500ల నోట్‌ను ఆ ఉప ఎన్నికల్లో పంచింది చంద్రబాబు టీడీపీ. ఆనాడు మొదలైన కరెన్సీ కట్టల ప్రవాహాన్ని చంద్రబాబు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజాభిప్రాయాన్ని డబ్బుతో కొనడం ప్రారంభించింది చంద్రబాబు. డబ్బుతో ఓట్లు కొని అధికారంలోకి వచ్చి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఎల్లో మీడియా సాయంతో ఏదో చేస్తున్నామని భ్రమ కల్పించి ఇష్టారాజ్యం దోచుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చి, తమ జేబులు నింపుకున్నారు. ప్రజాభిప్రాయం ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ఓటరు మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. అందుకే..సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్‌ను స్వాగతించకుండా విమర్శించడం ఆయనలోని అప్రజాస్వామిక, అవినీతి ఆలొచనలకు నిదర్శనం.
ఎన్నికలంటే చంద్రబాబుకు తెలిసింది ఓటర్లను మద్యంలో, డబ్బులో ముంచడమే. అందులో భాగంగానే బస్సు యాత్రలో చంద్రబాబు తాగుబోతుల తరపున వకల్తా పుచ్చుకున్నారు. మద్యం రేట్లు, బ్రాండ్లు పెరిగాయని, షాపులు 8 గంటలే మూసేస్తున్నారని తెగ బాధపడ్డారు. టీడీపీ అధినేతల కాకుండా తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడారు. చంద్రబాబు మాటలు విని మహిళలు ఛీ కొడుతున్నారు. తమ కుటుంబాలు బాగు పడటం బాబుకు ఇష్టంలేదా? అని ప్రశ్నిస్తున్నారు. దశలు వారీగా మద్య నిషేధాన్ని మహిళాలోకం స్వాగతిస్తోంది. దశాబ్దాలుగా ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంపిణీకి అలవాటు పడిన చంద్రబాబు అండ్ కో కొత్త ఆర్డినెన్స్‌తో గంగ వెర్రులు ఎత్తుతోంది. మద్యం, డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేమని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటామని ఆయన మీడియా సాక్షిగా చెప్పారు. కొత్త ఆర్డినెన్స్, నిఘా యాప్‌పై చంద్రబాబు చిందులేశారు. ఎన్నికల కోసమే నిఘా యాప్ ఎలా తీసుకు వస్తారంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రలోభాలను అరికట్టడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్, యాప్‌లను చంద్రబాబు స్వాగతించకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఆయనకు ప్రజాసవామ్యంపై ఉన్న నమ్మకం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ‘కొత్త పలుకు’ కూడా చంద్రబాబు మాటలను సమర్ధిస్తూ అక్షరాలు కుమ్మరించడం జర్నలిజానికి సిగ్గుచేటు. డబ్బు, మద్యంతో ప్రజాతీర్పు సరిగా వస్తుందా?. ఈ ప్రశ్నకు ‘కొత్త పలుకు’కలం సమాధానం చెప్పగలదా?. అంటే..డబ్బు, మద్యంతో ఓటర్ల అభిప్రాయాన్ని కొనాలనే ఆలోచనలో బాబు, కొత్త పలుకు ఉన్నారా?. మద్యం, డబ్బుతోనే ప్రజాస్వామ్యం నడుస్తుందని భావిస్తున్నారా?. డబ్బు, మద్యంతో నడిచే ప్రజాసవామ్యం వద్దని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించి ముందుకెళ్తుంటే మద్దతివ్వకుండా ఏడుపులు పెడబొబ్బులు ఏంటో అర్ధం కావడంలేదు..!!
పోలీస్ వ్యవస్థపై కూడా చంద్రబాబు నాయుడు, ‘కొత్త పలుకు’ విమర్శలు చేయడం విచిత్రంగా ఉంది. పోలీసులు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలను మించిపోయారంటూ ‘కొత్త పలుకు’ రాసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై పోలీసులతో దాడి చేయించిన ఘటనను ఓసారి గుర్తుకు తెచ్చుకుంటే ‘కొత్త పలుకు’కలానికి మంచిది. ఆడవారని కూడా చూడకుండా ఉరికించి..ఉరికించి పోలీసులతో కొట్టించారు. పోలీస్ వ్యవస్థను సొంత అవసరాలకు వాడుకోవడం మొదలు పెట్టిందే చంద్రబాబు. పోలీస్ వ్యవస్థ విలువలను మంట గలిపింది..పోలీస్ వ్యవస్థలోకి కులాన్ని జొప్పించిందే చంద్రబాబు. ఇవన్నీ కొత్త పలుకు కలానికి కనిపించిన రాయదు. పోలీసులకు ఓ కుటుంబం ఉంటుంది అని గుర్తించి వారికి వీక్తీ ఆఫ్‌లు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు చేస్తూ వారికి ప్రతిభకు తగ్గట్లు ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్.
స్థానిక ఎన్నికల విజయం వన్ సైడ్ అనేది ఇప్పటికే తేలిపోయింది. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ సీపీని నడిపిస్తాయని చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీకే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయడం సాంప్రదాయం. స్థానిక ఎన్నికల్లో జనసేన – బీజేపీలది విఫల ప్రయోగమే. ఈ విషయంలో కొత్త పలుకు వాస్తవమే రాసింది. కాకపోతే..పవన కల్యాణ్‌ను అసలు బీజేపీ పెద్దలు గుర్తించడం లేదు. కొత్త పలుకు కలం ఎందుకో పవన్ కల్యాణ్‌ను ముందు పెట్టడానికి తెగ ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. ప్రజల్లో విలులేని పవన్ కల్యాణ్‌కు రాజకీయ ప్రాణం పోయడానికి కొత్త పలుకు ప్రయత్నిస్తున్నట్లుంది.
వైఎస్ఆర్ సీపీతో స్నేహంగా ఉండాలనేది బీజేపీ రాజకీయ నిర్ణయం.ఈ నిర్ణయంపై పవన్ కల్యాణ్ ఇష్టంగా లేరని కొత్త పలుకు రాయడం ఎలా అర్ధం చేసుకోవాలి?. వపన్ కల్యాణ్ రాజకీయంగా బతికించాలని ప్రయత్నించడం, పవన్ కల్యాణ్ వాయిస్ కొత్త పలుకు వినిపిస్తున్నట్లుంది. చంద్రబాబు మనిషి పవన్ కల్యాణ్. చంద్రబాబు సూచనలు మేరకే పవన్ కల్యాణ్ బీజేపీ పంచన చేరారని రాజకీయ వర్గాల్లో రోఊ మాట్లాడుకునే మాట. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటంలేదని అనుకుంటుందట..!. ఇలా ఉన్నాయి ‘కొత్త పలుకు’ రాతలు.
బీజేపీకి రాజ్యసభలో సీట్లు అవసరం కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీస్తున్నారని, కేసుల భయంతో వైఎస్ జగన్ బీజేపీతో స్నేహంగా ఉంటున్నారని కొత్త పలుకులో రాసుకొచ్చారు. కేసులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయమా?. ఈ పదాలు రాసే ముందు కొంచెం ఆలోచించుకుంటే బాగుండేది. కేసులు అంటే భయపడితే ఢిల్లీని ఢీకొనే వాడా?. కేసులు అంటే భయపడితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేవాడా?. కేసులు అంటే భయముంటే ఓదార్పు యాత్ర చేపట్టేవారా?. కేసులంటే భయం లేదు..ప్రజలంటే ప్రేమ కాబట్టే చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి ఎన్ని బాధలు పెట్టినా గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు. అది గుండె కాదు..మండే అగ్ని గోళమని కొత్త పలుకు గుర్తు పెట్టుకోవాలి. కేసులు భయపడి కాదు బీజేపీతో స్నేహంగా ఉంటుంది. రాష్ట్రం కోసం,ఐదు కోట్ల ఆంధ్రుల కోసం,అభివృద్ది కోసం బీజేపీ, కేంద్రంతో స్నేహంగా ఉంటున్నారు. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని ఆయనతో మంచిగా ఉండటంలో తప్పు లేదు.ఆయనను అడిగి నిధులు తెచ్చుకోవడంలో అసలూ తప్పులేదు. ఇవన్నీ రాయకుండా కేసులకు భయపడి బీజేపీతో స్నేహంగా ఉ న్నారని రాసి పాఠకులను తప్పుదోవ పట్టించడం కరక్ట్ కాదు. ఢిల్లీ టూర్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. గంటపాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తరువాత బయటకు వచ్చి హోంశాఖకు మోదీనే స్వయంగా కాల్ చేసి..వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదీ అడిగితే అది చేయండి అని చెప్పేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుడి భుజం విజయసాయి రెడ్డి అంటే కూడా ప్రధాని మోదీకి ఎంతో అభిమానం. ఈ అభిమానాన్ని,నమ్మకాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు వాడుకుంటున్నారు, స్వప్రయోజనాలకు వాడుకోవడం లేదు. ఈ విషయం మాత్రం ‘కొత్త పలుకు’ రాయదు.
ఏపీకి పెట్టుబడుల తరలి వస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 9 నెలలకే పాలకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. ఏపీలో పాలనను చూసిన పెట్టుబడిదారులు కదిలి వస్తున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన తరువాత పెట్టుబడిదారుల ఆలోచనల్లో వేగం పెరిగింది. విశాఖకు అనేక ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కడపలో మరో స్టీల్ ప్లాంట్‌కు స్విస్‌కు చెందిన ఐఎంఆర్గ్రూప్ ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. స్విస్ కంపెనీ గురించి ఎల్లో మీడియా రాయదు, కొత్త పలుకులో ఆ వాసనే ఉండదు. వీళ్లు ప్రజాస్వామ్యం గురించి, జర్నలిజం విలువలు గురించి మాట్లాడుతారు. రిలయన్స్ అధినేత ముఖేష అంబానీ స్వయంగా వచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్లారు. ఇద్దరూ తప్పకుండా రాష్ట్రంలో పెట్టుబడులు గురించి మాట్లాడుకుని ఉంటారు. ఎంపీ సీటు పక్కన పెడితే..లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి, లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఎంపీ సీటు పెద్ద విషయం కాదు. అది కూడా రాష్ట్రాభివృధ్ది కోటాలనే పడిపోతుంది. రాష్ట్రాభివృద్ధి కోసం ఆ ఎంపీ సీటు ఇచ్చారని భావించాలి. అంతేకాని కోడిగుడ్డు మీద ఈకలు పీక కూడదు.
గెలుపేనా?ఓటమేనా ప్రజాస్వామ్యంలో పోటీ చేయాలి. రాజకీయ పార్టీ ప్రాధమిక హక్కు, విధి . డబ్బులు , మద్యం పంచొద్దన్నారు. పంచితే జైలుకు పంపిస్తారు. ఎన్నిక చెల్లదు. పోటీ చేయడం అనవసరమని కొత్త పలుకు చంద్రబాబు మనసులో మాట రాయడం అనేక ప్రశ్నలకు తావిస్తుంది. అంటే..ఇన్ని రోజులు చంద్రబాబు అండ్ కో మద్యం, డబ్బులు చల్లి ఎన్నికల్లో గెలిచారా?. చంద్రబాబుకు నిజంగా ప్రజల్లో పట్టులేదా?. తమను నమ్మరు గనుకనే డబ్బు, మద్యం వెదజల్లుతున్నారా?. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా కూడా డబ్బు, మద్యంతోనే నడిచిందా?. ఇప్పుడు ఎన్నికలు వద్దు, మేం పోటీ చేయం అంటుంటే ఈ ప్రశ్నలు రాక మానవు. గతం గతః అనుకుని ఇకనైనా మద్యం, మనీకి దూరంగా ఉండాలని చంద్రబాబు అనుకుంటే బాగుండేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆర్డినెన్స్, యాప్‌కు మద్దతు పలికి ఉంటే ప్రజలు, ప్రజాస్వామ్య ప్రియులు హర్షించేవారు. ఎన్నికల్లోనే పాల్గొనడం కష్టమని కాడిపడేయడం చంద్రబాబు రాజకీయ జీవితానికే సిగ్గు చేటు. చంద్రబాబు మనసులో మాటను బయట పెడుతూ రాసే కొత్త పలుకు ఇంకా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యం ప్రాణం ఎన్నికల్లోనే ఉంది. భారత దేశ ప్రాణం గ్రామాల్లోనే ఉంది.
బిర్రు ప్రతాప్ రెడ్డిని ప్రయోగించి బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నారు. ఆయన రెడ్డి కాబట్టి రెడ్లే బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నారనే భ్రమ కల్పించడానికి తీవ్రంగా చంద్రబాబు ప్రయత్నించారు. సోషల్ మీడియా పుణ్యమాని అది సాధ్యం కాలేదు. మార్చిలోగా స్థానిక ఎన్నికలు జరగకపోతే రూ.5,500 కోట్లు మురిగిపోతాయని తెలుసు అయినా ఎన్నికలను అడ్డుకోవాలనే ప్రయత్నం. రాష్ట్రాభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలే చంద్రబాబుకు ముఖ్యమని అర్ధం చేసుకోవచ్చు. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజల కోసం రాజకీయాలు చేయాలి. తన కోసం రాజకీయాలు చేయడం మానుకోవాలి. జర్నలిజం జనం కోసమే కాని బాబులాంటి వారి కోసం కాదని ‘కొత్త పలుకు’ గుర్తిస్తే సంతోషం.
ఈ వారం ‘కొత్త పలుకు’ టైటిల్ నన్ను బాగా ఆకట్టుకుంది. ‘పోరాడితే వచ్చేదేమిటీ’ అని లెక్కలేసుకుంటూ కూర్చుంటే చరిత్రే ఉండేది కాదు. చరిత్ర, భవిష్యత్తు అంతా కూడా పోరాటాలమయమే. పోరాటాలతోనే రేపటి రోజు పురుడు పోసుకుంటుంది. ప్రపంచ చరిత్ర అనే బుక్కు నేను పోరాటం అనే పేరు పెడతాను.
–