ఏకగ్రీవమైతే భారీ నజరానా!

jagan
Spread the love
  • గ్రామ సర్పంచ్, వార్డు పదవులతో సహా ఏకగ్రీవమైన గ్రామాలకే వర్తింపు  

  • 2 వేలలోపు జనాభా ఉండే గ్రామం ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు 

  • పది వేల జనాభా ఉండే గ్రామం ఏకగ్రీవమైతే రూ.20 లక్షలు 

  • ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్‌ శాఖ

  • పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందించనుంది. ఇలా ఏకగ్రీవాలు జరిగే చోట.. గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా పార్టీ రహితంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే.

  • గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందజేస్తోంది. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. గ్రామాలకు ఏడాది కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ గ్రాంట్లు అందు తున్నాయి. వీటితోపాటు పంచా యతీలు స్థానికంగా పన్నుల రూపంలో వసూలు చేసుకునే మొత్తానికి సమానంగా ఏకగ్రీవ మయ్యే గ్రామాలకు ప్రభుత్వం నిధులు అందజేసే అవకాశం ఉందని అంటున్నారు.

గ్రీన్ టీ తాగితే ఆ కొవ్వు 75 శాతం కరుగుతుందట!

 

 

 

వరుసగా తొమ్మిదో ఏడాది ఆస్తులు ప్రకటించిన చంద్రబాబు కుటుంబం

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *