50 ఏళ్లు దాటిన పెద్దల కోసం హైదరాబాద్‌లో స్వయంవరం

Spread the love

50 ఏళ్లు దాటిన పెద్దలకు హైదరాబాద్‌లో స్వయంవరం జరిగినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

ఎల్డర్స్‌ క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌, తోడు-నీడ, అనుబంధ్ ఫౌండేషన్‌ సంయుక్తాధ్వర్యంలో తొలిసారి హైదరాబాద్‌లో

50 ఏళ్లు దాటిన పెద్దలకు స్వయంవరం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఆదివారం దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో నిర్వహించిన 50 ఏళ్లు దాటిన పెద్దలకు స్వయంవరానికి విశేష స్పందన లభించింది.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పెద్దలు హాజరయ్యారు. 50-90 ఏళ్ల వయసువారిలో అసలు పెళ్లి కానివారు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న వారు దాదాపు 400 మంది వరకు వచ్చారని కథనంలో రాశారు.

భర్త చేతిలో మోసపోయిన మహిళలు, భార్య చేతిలో మోసానికి గురైన భర్తలు, భార్యను కోల్పోయిన భర్తలు, భార్య చనిపోవడంతో పిల్లలు తమను పట్టించుకోని వారు ఇందులో పాల్గొని తమ సహచరులు ఎలా ఉండాలో అభిప్రాయాలు తెలియజేశారు.

కౌన్సెలింగ్‌ తర్వాత వివాహ ఒప్పంద తేదీని నిర్ణయించి, రిజిస్ట్రార్‌ సహాయంతో ఉచితంగా పెళ్లి చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి రాసింది.

కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య మాట్లాడుతూ.. ఒక వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయిన స్త్రీలు, పురుషులు ఒంటరిగా జీవించలేక ఎంతో బాధ పడుతుంటారని చెప్పారు. అలాంటి పెద్దలు నిస్సంకోచంగా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.

Marriage
Marriage

ఇరిగేషన్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైరైన ఈశ్వర్‌ ప్రసాద్‌ (64), విజయ అనే మహిళను ఇష్టపడ్డారు.

ఈశ్వర్‌ ప్రసాద్‌ రెండేళ్లుగా ఈ కార్యక్రమ నిర్వాహక సంస్థలో సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కటైన ఆ జంటను అతిథులు అభినందించారని ఆంధ్రజ్యోతి రాసింది.

Source:https://www.bbc.com/telugu/other-news-51903369

బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4600 కోట్లు

 

 

Petition Filed in Supreme Court Against Pension To Politicians

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *