భారత్ అనేది జనాభా ఉన్న దేశం. ఇక్కడ నిత్యం కోట్ల మంది పొట్ట కూటి కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. రోజు వారీ కూలీలు ఎక్కువగా ఉండే దేశం మనది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత మంది కూలీలు ఉన్న దేశం ఏ ఒక్కటి లేదు. ఈ విషయం అందరికి స్పష్టంగా తెలుసు. భారత్ లో లాక్ డౌన్ ని ప్రకటించారు. ఈ లాక్ డౌన్ తో చాలా మంది కూలీలు ఇప్పుడు తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఎక్కడి నుంచో వలస వచ్చిన కూలీలు ఇప్పుడు ఆత్మహత్య లు కూడా చేసుకునే పరిస్థితి మన దేశ౦లో నెలకొంది. లాక్ డౌన్ ని ప్రకటించడం అంటే సాధారణ విషయం కాదు.
ఇప్పుడు ఈ లాక్ డౌన్ చూసి ప్రపంచం మొత్తం కూడా షాక్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. లాక్ డౌన్ ని భారత్ ప్రకటించే అవకాశం లేదని భావించారు అందరూ కూడా.
కాని అనూహ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం తో అందరూ షాక్ అయ్యారు. ఈ నిర్ణయాన్ని ఎలా అయినా సరే అమలు చెయ్యాలని మోడీ సర్కార్ భావిస్తుంది. దీన్ని ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నా పెద్ద షాక్ కాదు గాని భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యమే. ప్రజలు రోడ్ల మీదకు రాకుండా చూస్తున్నారు.
దీనితో భారత్ రోజు వేల కోట్ల రూపాయలను నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని దేశాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని భావించినా సరే అది సాధ్యం కాదు అని వెనక్కు తగ్గుతున్నాయి. కాని మోడీ సర్కార్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. బ్రతికి ఉంటే ఏమైనా తినవచ్చు అని ఇప్పుడు లాక్ డౌన్ ని అమలు చేయడం అనేది పక్కా అని భావించి నిర్ణయం తీసుకున్నారు.