టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత వారి కుటుంబంలో ఒకరిగా చాలా త్వరగా కలిసిపోయింది.ఇక నాగార్జున భార్య అమల, సమంత మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది.అమలకి సమంత కోడలు అవుతుంది.మరి అత్తా, కోడలి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది అనే విషయాలపై తాజాగా అక్కినేని అమల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అమల ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.
ఇంట్లో సమంత మీకోసం వంట చేస్తుందా అన్న ప్రశ్నకి అమల నో అని చెప్పింది.సమంత ఇంట్లో వంట చేయదు.ఇంట్లో అందరూ ఉన్న సమయంలో నాగార్జున వంట చేస్తారు.వంటలు చేయడంలో ఆయనకి మంచి నైపుణ్యం ఉంది.అయితే సమంతకు వంటలు చేయాల్సిన అవసరం పెద్దగా లేదు.
నాకు కూడా పెద్దగా వంటలు చేయడం రాదు.ఇంట్లో వంటలు చేయడానికి కుక్ ఉంటారు.అందుకే సమంత వంటలు చేసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు అని చెప్పింది.మొత్తానికి అత్తా కోడలు మధ్య ఉన్న అనుబంధం ఈ ఇంటర్వ్యూలో అమల చెప్పుకొచ్చింది.తమ ఇద్దరి మధ్య అత్తా కోడలు రిలేషన్ కంటే ఫ్రెండ్లీ రిలేషన్ ఎక్కువగా ఉంటుందని కూడా ఆమె చెప్పుకొచ్చింది.
Publisher: Chaipakodi