కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అమల్లో ఉన్న లాక్డౌన్ పరిస్థితుల్లో.. జనం గత నెలలో తమ యాప్ ద్వారా ఫార్మసీకి సంబంధించి ఏ వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారన్న విషయాన్ని ‘డుంజో’ అనే డెలివరీ యాప్ వెల్లడించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ కన్నా ముంబయి, చెన్నై నగరాల్లో బాగా పాపులర్ అయిన ‘డుంజో’లో.. చెన్నై, జైపూర్ వాసులు హ్యాండ్వాష్ను ఎక్కువగా ఆర్డర్ చేశారు. తద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు శుభ్రతే ప్రధాన అవసరమని గుర్తించినట్లున్నారు.
బెంగళూరు, పుణె నగరాల్లో ప్రెగ్నెన్సీ కిట్లను అధికంగా డెలివరీ చేశారు. అన్నింటికన్నా భిన్నంగా ముంబయి వాసులు ఆర్డర్ చేసినవాటిలో కండోమ్స్ మొదటి స్థానంలో ఉన్నాయి.
ఇక హైదరాబాద్ వాసులు ఐ-పిల్ అనే గర్భనిరోధక మాత్రలను విచ్చలవిడిగా వాడేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని డుంజో చెప్పుకొచ్చింది.