ప్రజలు ఇప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మార్గాలు వెతుకుతున్నారు.దీనికి కారణం లేకపోలేదు. ఒక పక్క కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళా ప్రజలు బయబ్రాంతుల్లో మునిగిపోతున్నారు. అంతకముందు మెడిసిన్స్‌పై ఆధారపడి వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే వారు. కానీ ఇప్పుడు మందులకు బదులు నేచురల్ గా ఇమ్యూనిటీని పెంచుకునేందుకు రకరకాల ఆహారపదార్ధాలు తీసుకుంటున్నారు. తీసుకునే ఆహారంలో కూడా మార్పులూ చేర్పులూ చేసుకుంటున్నారు. ఐతే, మీరు రెడ్ రైస్ ను ఓసారి ట్రై చేసి చుడండి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషక పదార్ధాలు ఈ రెడ్ రైస్ లో పుష్కలంగా ఉన్నాయి.
రెడ్ రైస్ గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదొక స్పెషల్ వెరైటీ రైస్.
దీనిలో ఉండే యాంటోసైనిన్ల వల్ల అంటే నీటిలో కరిగిపోయే పిగ్మెంట్స్ వల్ల దీనికి ఈ రంగు వచ్చింది. ఇది మీ డైట్ చార్ట్ కు కలర్ ను యాడ్ చేస్తుంది. అదే సమయంలో, మీకు వెయిట్ లాస్ విషయంలో కూడా సహాయం చేస్తుంది. పాలిష్ చేయబడిన రైస్ వెరైటీస్ కంటే ఈ రెడ్ రైస్ లో న్యూట్రిషనల్ విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇది వెయిట్ లాస్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫ్యాట్ కంటెంట్ సున్నా. కాబట్టి, దీన్ని తినడం వలన బరువు పెరుగుతారేమోనన్న భయం అసలు అవసరం లేదు. రెడ్ రైస్ లో విటమిన్లు అలాగే ఐరన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఈ రెండూ శరీరంలోని రక్తకణాల వృద్ధిని పెంచుతాయి. దాంతో, స్కిన్ హెల్తీగా మారుతుంది.
రైస్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ పై పోరాటం జరుపుతాయి.కాబట్టి వృద్ధాప్య ఛాయలు అనేవి రావు. రెడ్ రైస్ లో మ్యాంగనీస్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి డయాబెటిస్ పేషంట్స్ కు అవసరం. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచేందుకు ఇది అవసరం. రెడ్ రైస్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి, ఇది జీర్ణక్రియ సులువుగా అవ్వటానికి ఉపయోగపడుతుంది.ఇందులో ఉండే ఫైబర్ మాటిమాటికీ కలిగే చిరు ఆకలి సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి, జంక్ ఫుడ్ పై మనసు వెళ్ళదు.
రెడ్ రైస్ ను మీరు డైట్ లో భాగంగా చేసుకుంటే ఇక బోన్ హెల్త్ గురించి దిగులు పడనవసరం లేదు. ఇందులో ఉన్న మెగ్నీషియం వలన ఇది సాధ్యమవుతుంది. ఇది బోన్స్ ను హెల్తీగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
ఇమ్మ్యూనిటీను పెంచుకోవడం వలన హెల్తీగా ఉండవచ్చు. ఫుడ్స్ ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవడం ముఖ్యం. రెడ్ రైస్ తో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతో, అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.