వీధి వర్తకులకు ‘సిఫార్సు లేఖ’ పథకం

0

*వీధి వర్తకులకు ‘సిఫార్సు లేఖ’ పథకం!* *రూ.10 వేలు వరకు రుణం పొందే వీలు*

దిల్లీ: దేశవ్యాప్తంగా వీధి వర్తకులకు మేలు చేసే ‘సిఫార్సు లేఖ (ఎల్‌ఓఆర్‌)’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. ‘ప్రధాన్‌మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి)’ పేరుతో జూన్‌ 1న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ (హెయూఏ) ఓ కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జులై 2 నుంచి పీఎం స్వనిధి పోర్టల్‌ పనిచేయడం ప్రారంభించింది.

అర్హులైన వీధి వర్తకులు ‘పీఎం స్వనిధి’ కింద రుణం పొందేందుకు ‘సిఫార్సు లేఖ (ఎల్‌ఓఆర్‌)’ కోసం పట్టణ స్థానిక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలని హెయూఏ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా పేర్కొన్నారు. ఎల్‌ఓఆర్‌ పొందిన వారికి గుర్తింపు కార్డులు, వర్తకపు అనుమతులను 30 రోజుల్లోగా అందజేస్తారు.

ఈ పథకం కింద రూ.10 వేలు వరకు నిర్వహణ మూలధనాన్ని రుణంగా పొందవచ్చు.

Leave a Reply