*టిక్‌టాక్‌కు ట్రంప్ 90రోజుల డెడ్‌లైన్*
వాషింగ్టన్: ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌కు ట్రంప్ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా..
దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీంతో టిక్‌టాక్‌కు నవంబర్ 12 వరకు గడవు లభించింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన గడువులోగా టిక్‌టాక్ అమ్మకం ప్రక్రియను బైట్‌డ్యాన్స్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అమెరికన్ యూజర్ల డేటాను కూడా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది.
అమెరికా జాతీయ భద్రతను బైట్‌డ్యాన్స్ ప్రమాదంలోకి నెట్టివేస్తుందనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ కార్యకలపాలను కూడా కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు ట్విటర్ కూడా టిక్‌టాక్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.