*కేవీపీవె సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం* _సైన్స్ ప్రాధ్యానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే దేశంలో శాస్త్ర సాంకేతికత విషయంలో అనుకున్నంత పురోగతి లేదు.
దీనికి ప్రధాన కారణం పరిశోధనలవైపు విద్యార్థులు ఆసక్తి కనబర్చకపోవడం. ఈ సమస్యను తీర్చడానికి డీఎస్టీ రకరకాల పథకాలను, స్కాలర్‌షిప్స్‌ను అందిస్తూ సైన్స్ పట్ల విద్యార్థులను ఆకర్షితులను చేయడానికి కృషి చేస్తుంది.
పరిశోధనల వైపు ప్రోత్సహించడానికి డీఎస్టీ ఏటా నిర్వహించే కేవీపీవై-2020 స్కాలర్షిప్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా ఆ వివరాలు._
*కేవీపీవై* : కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)ను కేంద్ర ప్రభుత్వం 1999లో ఏర్పాటు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) ఈ స్కాలర్షిప్స్ ద్వారా విద్యార్థులను సైన్స్ రంగం వైపు ప్రోత్సహించడానికి దీన్ని ఏర్పాటు చేసింది. కేవీపీవై ద్వారా బేసిక్ సైన్సెస్‌లో ప్రతిభను ప్రదర్శించిన అభ్యర్థులకు డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు ఉపకారవేతనాలను అందిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నిధులను సమకూరుస్తుంది. *ఎవరు అర్హులు?* సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సులు చదువుతున్న వారు అర్హులు. దీనిలో ఎస్ఏ, ఎస్ఎక్స్, ఎస్బీ అని మూడు స్ట్రీములున్నాయి. *స్ట్రీముల వారీగా వివరాలు*
*ఎస్ఏ:* ప్రస్తుత విద్యా సంవత్సరం (2020-21)లో సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ విభాగం కిందకి వస్తారు. పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం మార్కులు సాధించినవారు కేవీపీవై రాతపరీక్షకు అర్హులు.
*ఎస్ఎక్స్* : 2020-21లో సైన్స్ సబ్జెక్టుల్లో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) సీనియర్ ఇంటర్ చదువుతున్నవారు ఈ స్ట్రీమ్ పరిధిలోకి వస్తారు. వీరంతా పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 75 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 65 శాతం) మార్కులు పొంది ఉండాలి. *ఎస్బీ:* 2020-21లో ప్రథమ సంవత్సరం బీఎస్సీ/బీఎస్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఎంఎస్ కోర్సులు లేదా బీస్టాట్/బీమ్యాథ్స్ చదువుతున్నవారు అర్హులు. వీళ్లు సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించాలి. *ఎంపిక విధానం:* జాతీయస్థాయిలో జరిగే ఆన్లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈసారి కొవిడ్‌తో ఇంటర్వ్యూలు రద్దు చేశారు.
*ఎగ్జామ్‌లో ఏం ఉంటుంది?* రాతపరీక్ష కోసం ప్రత్యేకమైన సిలబస్ ఏమీ నిర్దేశించలేదు. విద్యార్థికి సైన్స్ సబ్జెక్టుల్లో ఉన్న అవగాహన, అర్థం చేసుకునే తీరు, విశ్లేషణను పరిశీలిస్తారు.
*స్కాలర్షిప్ వివరాలు* ఎంపికైనవారికి డిగ్రీలో ఉన్నప్పుడు మూడేండ్లపాటు ప్రతినెలా రూ.5000 ఉపకారవేతనంగా చెల్లిస్తారు. అలాగే పీజీలో రూ.7000 అందిస్తారు. వీటితోపాటు ఏటా కంటింజెన్సీ గ్రాంటు కింద డిగ్రీస్థాయి వారికి రూ.20 వేలు, పీజీస్థాయి వారికి రూ.28 వేలు ఇస్తారు. ప్రసిద్ధ సంస్థల్లో వేసవి క్యాంపులూ ఉంటాయి. *సమ్మర్ ప్రోగ్రామ్* : ప్రతి ఏడాది వేసవిలో జాతీయ, అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థల్లో పరిశోధనలకు అవకాశం కల్పిస్తారు. *ఇతర ఉపయోగాలు* : కైవీపీవై ఫెలోలకు ఐడెంటీకార్డు ఇస్తారు. దీనివల్ల జాతీయ పరిశోధన సంస్థలు/యూనివర్సిటీల్లో ల్యాబొరేటరీ, లైబ్రరీలను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తారు. *దరఖాస్తు: ఆన్లైన్లో*
*చివరితేదీ* : అక్టోబర్ 5
*దరఖాస్తు ఫీజు:* “◆ జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 1250/- ◆ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.625/-.
*పరీక్షతేదీ* : 2021, జనవరి 31 *పరీక్ష కేంద్రాలు:* రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. *వెబ్సైట్:* http://kvpy.iisc.ernet.in