*వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు*
దిల్లీ: వైద్య సేవలు అందించే వారిపై దాడులకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. నిందితులపై దర్యాప్తును 30 రోజుల్లోగా, న్యాయస్థానాల్లో విచారణను ఏడాదిలోగా ముగించాల్సి ఉంటుంది.
దోషులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అంటువ్యాధుల సవరణ బిల్లు-2020ని శనివారం ఎగువసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఇదివరకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తాజా బిల్లును ప్రతిపాదించారు.
కరోనా చికిత్సలందించే సమయంలో వైద్యులపై జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును తీసుకొచ్చారు.