7న పీఎస్‌ఎల్వీ-సి49 ప్రయోగం

Spread the love

శ్రీహరికోట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి నవంబరు 7న మధ్యాహ్నం 3.02 గంటలకు పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్వీ)-సి49 ను ప్రయోగించనున్నట్లు ఇస్రో పేర్కొంది. ఈ మేరకు రాకెట్‌ సన్నద్ధత సమావేశంలో బుధవారం శాస్త్రవేత్తలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఎస్‌ఎల్వీ-సి49 ద్వారా మన దేశానికి చెందిన ఈవోఎస్‌-01(రీశాట్‌-2బీఆర్‌2)తోపాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ దఫా మీడియాను అనుమతించబోమని, సందర్శకుల గ్యాలరీనీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాహకనౌక 4 దశల పనులు చివరి దశలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *