New traffic rules in Hyderabad

Spread the love

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేశారు పోలీసులు. ఇకపై ఎలా పడితే అలా బండి నడిపితే కదరదు. హైదరాబాద్‌ పోలీసులు కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను అమలులోకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయనున్నారు.

ర్యాష్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌.. సిగ్నల్‌ జంపింగ్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే ఈ రూల్స్‌ను సైబరాబాద్‌ పోలీసులు అమలు చేస్తున్నారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించి… చలానాన్లు కట్టుకుందామంటే సరిపోదు. మారిన ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించకపోతే… జీవితాంతం బండి నడిపే అవకాశాన్ని కోల్పోతారు.

చలాన్లతో పాటు లైసెన్ల రద్దు వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు.

ఇంక ఏమన్నారంటే : –
 ‘రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే ట్రాఫిక్ ఉల్లంఘనలే కారణం.
 మొదటిసారి చేస్తే..మూడు నెలల వరకు ట్రాఫిక్ లైసెన్స్ సస్పెండ్, మళ్లీ అదే ఉల్లంఘన చేసి పట్టుబడితే…శాశ్వతంగా రద్దు చేయాలని సెక్షన్ 206 చెబుతోంది.

 మోటార్ వాహనాల చట్టంలో భారత ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది.
 ట్రిపుల్ రైడింగ్ చేయడం, సిగ్నల్ జంప్ చేయడం, ఆపోజిట్ గా బండి నడపడం, మద్యం తాగి నడపడం, ఓవర్ స్పీడ్ చేయడం, రేసింగ్..ఇలాంటి నిర్దిష్టమైన ఉల్లంఘనలు ఉన్నాయి.
 హెల్మెట్ లేకుండా..డ్రైవింగ్ చేస్తే..మొదటిసారి లైసెన్స్ మూడు నెలలు, తర్వాత..శాశ్వాతంగా రద్దు చేయాలని చట్టంలో ఉంది.

 లైసెన్స్ మూడు నెలలు, శాశ్వతంగా రద్దు అయి ఉంటుందో..ఆ సమయాల్లో అనధికారికంగా బండి నడిపితే..చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం.
 ఆర్టీఏ నుంచి మళ్లీ లైసెన్స్ పొందాలంటే..ఓ కోర్సు పూర్తి చేయాల్సిన బాద్యత ఉంటుంది’ అన్నారు’ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *