భారత్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌

Spread the love

*భారత్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది* *: గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌*

*2020-21లో జీడీపీ క్షీణత 10.8 శాతమే* *2021-22లో 13 శాతం వృద్ధిరేటు!* ముంబయి: భారత ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) క్రమంగా కోలుకుంటోందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 10.8 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది. జీడీపీ 14.8 శాతం క్షీణించవచ్చని ఇంతకుముందు సంస్థ అంచనా వేయడం గమనార్హం.

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతోందని అమెరికాకు చెందిన రెండు సంస్థలు ప్రకటించడం, అత్యవసర వినియోగానికి అనుమతులు కోరతామని ప్రకటించిన సంగతి విదితమే. ఆర్థిక వ్యవస్థ రికవరీకి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తోడ్పాటు అందిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వాస్తవ ప్రాతిపదికన, కొవిడ్‌-19 ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ జీడీపీ 9.5 శాతం క్షీణత నమోదు చేయవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేసిన సంగతి తెలిసిందే. కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ఏకంగా 13 శాతానికి చేరే అవకాశం ఉందని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ నివేదిక పేర్కొంది.

ఆర్థిక కార్యకలాపాలు 2021 ఏడాది నుంచి అర్థవంతంగా పుంజుకుంటాయని, వినియోగదార్లకు సేవలు అందించే రంగాలు అత్యంత వేగంగా కోలుకుంటాయని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ అభిప్రాయపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *