*రష్యా వ్యాక్సిన్ రిలీజ్ రెడీ?*
*ఆగస్టు 12న రిజిస్టర్ చేయిస్తా మన్నఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్*
*ట్రయల్స్ రూల్స్ ఫాలో కావాల్సిందే: డబ్ల్ యూహెచ్*
*ఇంత స్పీడ్ నా.. వికటించొచ్చు జాగ్రత్త: సైంటి స్టులు*
న్యూఢిల్లీ: కరోనాకు తొలి వ్యాక్సిన్ త్వరలోనే రాబోతోంది. ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న రిజిస్టర్ చేయించనున్నట్టు ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఒలెగ్ గ్రిడ్నెవ్ శుక్రవారం తెలిపారు. దేశంలో భారీ స్థాయిలో వ్యాక్సి నేషన్ అక్టోబర్ లో స్టార్టవుతుందని ఇంతకుముందే చెప్పారు. వ్యాక్సిన్ తయారీకి అవసరమయ్యే ఖర్చం తా దేశమే భరిస్తోందన్నారు. ‘ప్రస్తుతం చివరి దశ నడుస్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ టైమ్ . జనానికి సురక్షితమైన టీకాను అందించాలి. తొలుత సీనియర్ సిటిజన్లు, మెడికల్ సిబ్బందికి టీకాలేస్తాం’ అని చెప్పారు. వ్యాక్సిన్‌ను గమలేయ రీసెర్చ్ ఇన్‌స్టి ట్యూట్, రష్యా రక్షణ శాఖ కలిసి అభివృద్ధి చేశాయని అన్నారు. రష్యా ప్రజల్లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యాక వ్యాక్సిన్ పనితీరును అంచనా వేస్తామన్నారు. వ్యాక్సిన్ తయారీ రెండు రకాలుగా ఉంటుందని, రెండూ కలిపితే ఇమ్యూనిటీ పెరుగుతుందని వివరించారు. టీకా క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభం అయ్యాయని, 38 మంది వాలంటీర్లకు టీకా ఇవ్వగా అందరిలో రోగ నిరోధక శక్తి పెరిగిందని వెల్లడించారు. వ్యాక్సిన్ వేసిన ఫస్ట్ గ్రూప్‌ను జులై 15న, సెకండ్ గ్రూప్‌ను జులై 20న డిశ్చార్జి చేశారు. రష్యాలో మరో కంపెనీ వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నా లజీ కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తోంది. ఈ సంస్థ వ్యాక్సిన్ ఉత్పత్తి నవంబర్‌లో స్టార్టయ్యే అవకాశం ఉంది.
*వ్యాక్సిన్ ట్రయల్స్ అన్నీ పూర్తవ్వాలి: డబ్ల్యూ హెచ్‌వో*
వ్యాక్సిన్ ట్రయల్స్ , డెవలప్‌మెంట్‌కు సంబంధించి రూపొందించుకున్న మార్గదర్శకాలు ఫాలో కావాలని రష్యాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్ యూహెచ్‌వో) కోరింది. వ్యాక్సిన్ రెగ్యులేటరీ అప్రూవల్ కోసం వచ్చే వారం అప్లై చేస్తామని రష్యా చెప్పడంతో డబ్ల్ యూహెచ్‌వో స్పందించింది. ట్రీట్‌మెంట్ కోసం బయటకొచ్చే వ్యాక్సిన్ అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకోవాలంది. ‘వ్యాక్సిన్ పని చేస్తదని అనుకోవడానికి, ట్రయల్స్ పూర్తి చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది’ అని చెప్పింది. గమలేయ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ రెడీ చేస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుత అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉందని, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పాసవుతుందని రష్యా అధికారులు చెప్పారు.