*ఏపీ లోని కొవిడ్ ఆసుపత్రుల్లో సేవల కోసం 333 మంది వాలంటీర్ల ఎంపిక_* ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్రంలోని 111 కొవిడ్ ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా పని చేసేందుకు 333 మందిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా ఎంపిక చేసింది. ఉద్యోగాల కోసం దాదాపు 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతలు, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తొలి విడతలో వీరిని ఎంపిక చేసింది. వాలంటీర్లుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారెవరైనా కొవిడ్ యాప్ ద్వారా లేదా covid-19info@ap.gov.in మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.