విషపూరితమైన, హానికరమైన శానిటైజర్లు

Spread the love

కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి లక్షల మందిని చంపేసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. కంటికి కనిపించని ఈ శత్రువు ఇంకా ఎంతమందిని మంచాన పడేస్తుందో, ప్రాణాలు బలి తీసుకుంటుందో తెలీదు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని నిపుణులు తేల్చేశారు. ఈ క్రమంలో కరోనా నుంచి రక్షణ కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి రెండు. ఒకటి ముఖానికి మాస్క్. రెండోది చేతులకు శానిటైజర్ రాసుకోవడం.

ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ రెండింటి మీదే ఆధారపడి బతుకుతోంది:
ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ రెండింటి మీదే ఆధారపడి బతుకుతోంది.

కరోనా నుంచి కాపాడుకోవాలంటే మరో దారి లేదు. మనం ఏ వస్తువుని ముట్టుకున్నా వెంటనే చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ముఖానికి మాస్క్, చేతిలో శానిటైజర్ మస్ట్. ఇలా అవి రెండూ మనిషి జీవితంలో భాగమైపోయాయి. దీంతో ఒక్కసారిగా మాస్క్ లకు, శానిటైజర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రకరకాల కంపెనీలకు చెందిన శానిటైజర్లు మార్కెట్ లోకి వెల్లువలా వచ్చేశాయి. ఇక్కడే మరో ప్రమాదం పొంచి ఉంది. కొన్ని సంస్థలు తయారు చేస్తున్న శానిటైజర్లతో కరోనా చావడం మాటేమో కానీ, మనమే పోయే ప్రమాదం ఉంది. కొన్ని శానిటైజర్లు ఏ మాత్రం సురక్షితం కాదని, మన ఆరోగ్యానికి చాలా హానికరమని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్రకటించింది. వాటిని వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని అస్సలు వాడకూడదని సూచించింది.

విషపూరితమైన, హానికరమైన శానిటైజర్లు:
ఇటీవల ఎఫ్‌డీఏ నిర్వహించిన పరీక్షల్లో కొన్ని శానిటైజర్లు విషపూరితమైనవిగా తేలాయి. వీటిని చేతికి రాసుకోని ఏమైనా ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని గుర్తించింది. ఎఫ్‌డీఏ గుర్తించిన శానిటైజర్లలో ‘ఎస్క్‌బయోకెమ్ (Eskbiochem SA) సంస్థకు చెందినవే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఎఫ్డీఏ గుర్తించిన ప్రమాదకర శానిటైజర్లు 9 వరకు ఉన్నాయి. ఎస్క్‌బయోకెమ్ కంపెనీ.. ఆమోదించని పదార్దాలను (unapproved ingredients) శానిటైజర్ల తయారీలో వినియోగించిందని, అందువల్ల ఈ కంపెనీ శానిటైజర్లు వాడొద్దని ఎఫ్డీఏ చెప్పింది. సాధారణంగా శానిటైజర్లలో ఆల్కహాల్ వాడతారనే విషయం తెలిసిందే. అయితే ఎక్స్ బయోకెమ్ కంపెనీ తయారు చేసిన శానిటైజర్లలో ప్రమాదకరమైన ఆల్కహాల్ వినియోగించారు.

ఈ 9 శానిటైజర్లను వాడొద్దు:
* ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజర్‌ – All-Clean Hand Sanitizer (NDC: 74589-002-01)
* ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శానిటైజర్ – Esk Biochem Hand Sanitizer (NDC: 74589-007-01)
* క్లీన్ కేర్ నోజెర్మ్ హ్యాండ్ శానిటైజర్ – CleanCare NoGerm Advanced Hand Sanitizer 75% Alcohol (NDC: 74589-008-04)
* లావర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజర్ – Lavar 70 Gel Hand Sanitizer (NDC: 74589-006-01)
* ది గుడ్ జెల్ యాంటీ బ్యాక్టీరియల్ జెల్ హ్యాండ్ శానిటైజర్ – The Good Gel Antibacterial Gel Hand Sanitizer (NDC: 74589-010-10)
* క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్‌ – CleanCare NoGerm Advanced Hand Sanitizer 80% Alcohol (NDC: 74589-005-03)
* క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 75% ఆల్కహాల్‌- CleanCare NoGerm Advanced Hand Sanitizer 75% Alcohol (NDC: 74589-009-01)
* క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్‌ – CleanCare NoGerm Advanced Hand Sanitizer 80% Alcohol (NDC: 74589-003-01)
* శాండిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ – Saniderm Advanced Hand Sanitizer (NDC: 74589-001-01)

అసలు ఈ 9 శానిటైజర్లలో ఏముంది? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
* ఎఫ్‌డీఏ నిషేదించిన ఈ శానిటైజర్లలో ప్రమాదకర మిథనాల్ ఉంది.
* మిథనాల్ కలిగిన శానిటైజర్లను ఉయోగిస్తే ఆరోగ్యం చెడిపోతుంది.
* కరోనా కంటే భయానకమైన సమస్యలు ఎదురవుతాయి.
* శానిటైజర్‌ను చేతికి రాసుకున్నప్పుడు చర్మంలోకి వెళ్తుందని, ఆ చేతులతో ఆహారాన్ని తీసుకుంటే మిథనాల్ కడుపులోకి చేరుతుందని నిపుణులు తెలిపారు.

ఈ 9 శానిటైజర్ల ప్రభావానికి గురైతే కలిగే అనర్థాలు:
* వికారం(nausea)
* వాంతులు(vomting)
* తలనొప్పి(head ache)
* కంటి చూపు మందగిస్తుంది(blurred vision)
* శాశ్వతంగా చూపు కోల్పోవడం(permanent blindness)
* మూర్ఛ (seizures)
* వణుకు ఏర్పడతాయి
* కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది (coma)
* నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది (permanent damage to nervous system)
* మరణం సంభవిస్తుంది(death)
* ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ప్రమాదానికి గురయ్యే అవకాశం
* సువాసనలు వెదజల్లే, గాఢమైన రంగులు కలిగిన శానిటైజర్ల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి
* పొరపాటున నోటికి తగిలితే.. విష ప్రభావానికి లోనయ్యే ప్రమాదముంది.

ఆ శానిటైజర్లు వాడుతున్నారా? వెంటనే డాక్టర్ ని సంప్రదించండి:
మిథనాల్ కలిసిన శానిటైజర్లను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అప్రమత్తం కావాలని, సురక్షితమైన శానిటైజర్లను మాత్రమే వాడాలని తెలిపారు. మన దేశంలో కూడా నకిలీ శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీలైనంతవరకు మంచి సంస్థకు చెందిన హ్యాండ్ శానిటైజర్లను వాడటమే ఉత్తమం. అయితే, ఎస్క్‌బయోకెమ్ (Eskbiochem SA) సంస్థ ఉత్పత్తులు మన ఇండియాలో విక్రయిస్తున్నారా లేదా అనేది స్పష్టమైన వివరాలేవీ అందలేదు. కానీ, జాగ్రత్తగా ఉండటం మంచిది. కరోనా, ఇతర క్రిముల నుంచి రక్షణ పొందడానికి ఎఫ్డీఏ మరో సూచన కూడా చేసింది. 20 సెకన్ల పాటు సోప్ తో శుభ్రంగా చేతులు కడుక్కోవడం కూడా మంచిదే అని సూచించింది.

సోప్ తో కూడా క్రిముల నుంచి రక్షణ పొందొచ్చు:
మిథనాల్ కలిగిన శానిటైజర్లు వాడుతున్నట్లు అయితే చికిత్స కోసం వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని ఎఫ్డీఏ తెలిపింది. అదే సమయంలో మిథనాల్ కలిగిన శానిటైజర్లను ఫ్లష్ చేయడం కానీ, డ్రైనేజీలో పారబోయడం కానీ చేయకూడదని చెప్పింది. అలాగే ఎఫ్డీఏ మరో కీలక సూచన కూడా చేసింది. మా శానిటైజర్ వైరస్ ల నుంచి 24 గంటలల పాటు కాపాడుతుంది అనే ప్రకటనలు అస్సలు నమ్మొద్దని చెప్పింది. శాస్త్రీయ ఆధారాలు లేనందున అలాంటి ప్రకటనలు నమ్మొద్దని చెప్పింది.

ఇథైల్‌ (ఇథనాల్‌).. మిథైల్‌ (మిథనాల్‌).. తేడా ఒక్క అక్షరమే కానీ.. ప్రమాదం ఎంతో!
ఏ రకం శానిటైజర్ శ్రేయస్కరం అంటే..

వాడాల్సినవి: ఇథైల్‌ ఆల్కహాల్‌, ఐసో ప్రొపైల్‌ ఆల్కహాల్‌, ఎన్‌ ప్రొపైల్‌ ఆల్కహాల్‌ ఆధారితమైనవి.
వాడకూడనివి: మిథైల్‌ ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు.

ఎలాంటి శానిటైజర్లు మేలు:
* జిగురు, నురుగు మాదిరి కంటే ద్రావణం మాదిరిగా ఉండే శానిటైజర్లతోనే ఎక్కువ ప్రయోజనం.
* చేతుల్లో వేసుకొని రుద్దుకున్న తర్వాత ఒక నిమిషంలో అది ఆవిరవ్వాలి. అలా కాకుండా చేతులకు అంటుకుని ఉంటే చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి.
* శానిటైజర్లలో 60-90 శాతం వరకూ ఆల్కహాల్‌ ఉండాలి. అంతకంటే తగ్గినా, ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితం రాకపోగా, కొత్త సమస్యలొస్తాయి.
* కనీసం 20-30 సెకన్ల పాటు చేతులకు రుద్దుకోవాలి.

కరోనా వ్యాక్సిన్ రేసులో ముందంజలో వారిద్దరే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *