*దృఢ సంకల్పంతో మహమ్మారిపై యుద్ధం* *కేంద్ర హోం మంత్రి అమిత్ షా* గురుగ్రామ్: కరోనా మహమ్మారితో యుద్ధంలో భారత్ మెరుగైన స్థితిలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ పోరాటాన్ని దృఢ సంకల్పంతో కొనసాగిస్తూ.. సమరోత్సాహంతో మహమ్మారిని ఓడిస్తామన్నారు. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌లు) భారీఎత్తున చేపట్టిన మొక్కలునాటే కార్యక్రమంలో భాగంగా కాదర్పుర్లోని సీఆర్పీఎఫ్ అధికారుల శిక్షణ అకాడమీ ప్రాంగణంలో ఆదివారం ఆయన మొక్క నాటారు. అనంతరం వివిధ సీఏపీఫ్ దళాల అధిపతులనుద్దేశించి వెబ్‌లింక్ ద్వారా మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌లో కరోనాతో విజయవంతంగా జరుగుతున్న పోరాటాన్ని ప్రపంచమంతా చూస్తోందని షా అన్నారు. యావత్ భారతావని ఒక్కటిగా పోరాడుతున్నట్లు వివరించారు. కొవిడ్‌తో యుద్ధంలో భద్రత దళాలది కీలకపాత్ర అని తాను హోంమంత్రిగా సగర్వంగా చెబుతున్నానన్నారు.
ఈ నెలాఖరు నాటికి సీఏపీఎఫ్ల ప్రాంగణాల్లో 1.37 కోట్ల మొక్కలు నాటాలన్నది తాజా కార్యక్రమం లక్ష్యం.