భార్యాభర్తల బంధానికి బ్రేక్.. ఈవారం వితికా ఔట్!

Big boss
Spread the love

భార్యాభర్తల బంధానికి బ్రేక్.. ఈవారం వితికా ఔట్!

బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్‌లో ఇంటి సభ్యులు మొత్తం ఉన్నారు. శ్రీముఖి, వరుణ్, వితికా, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, అలీలు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.

బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్ పక్రియ చాలా కీలకంగా మారింది. అన్ని నామినేషన్స్ కంటే భిన్నంగా ఈసారి హౌస్‌లో ఉన్న అందర్నీ నామినేట్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ప్రస్తుతం హౌస్‌లో ఉన్న శ్రీముఖి, వరుణ్, వితికా, బాబా భాస్కర్, అలీ రెజా, రాహుల్, శివజ్యోతిలు ఏడుగురూ నామినేట్ అయ్యారు. అయితే ఈ ఏడుగురులో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.

పోల్ రిజల్ట్:

వరుణ్ -35%

రాహుల్-24%

శ్రీముఖి-19%

బాబా బాస్కర్-15%

ఆలీ-11%

వితిక-7%

శివ జ్యోతి-12%

ఈ పోల్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానికిపై ఒపీనియన్ పోల్స్ నిర్వహించగా.. ప్రేక్షకుల నుండి వినిపిస్తున్న ఒకే ఒకమాట వితికా. భర్త వరుణ్ హెల్ప్‌తో పాటు రాహుల్, పునర్నవిలతో గ్రూప్ కట్టి నామినేషన్స్ నుండి తప్పించుకుంది వితికా. రీసెంట్‌గా బాబా భాస్కర్‌ను బ్యాటిల్ ఆఫ్ ది మెడాలియన్ టాస్క్‌లో దొడ్డిదారిలో బోల్తాకొట్టించి గత వారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యింది.
అయితే ఈవారం నామినేషన్స్ టాస్క్‌లో ఈ భార్యాభర్తల (వరుణ్-వితికా) కంబైండ్ ఆటపై తిరగబడింది శివజ్యోతి. ఆటను ఆటలా ఆడకుండా ఎన్నాళ్లు భార్యను కాపాడుకుంటూ వచ్చి మిగిలిన వాళ్లను బలి చేస్తారని ఎదురుతిరిగింది. నామినేషన్స్‌లో భాగంగా భార్య కోసం వరుణ్ తన మూడో స్థానాన్ని త్యాగం చేయడంతో అలా ఎలా ఇస్తావ్ అని ప్రశ్నిస్తూ తనకి కూడా మూడో స్థానం కావాలని భీష్మించుకుని కూర్చోవడంతో బిగ్ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి మొత్తం హౌస్‌లో ఉన్న ఏడుగుర్నీ నామినేట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఎవరి కారణం చేత అయితే ఈ ఏడురుగు నామినేషన్స్‌లోకి వెళ్లారో వాళ్లే ఎలిమినేట్ కావడానికి తొలి రెండు స్థానాల్లో ఉండటం విశేషం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *