Teluguwonders: ఎప్పటినుండో ఎదురుచూస్తున్న BIGBOSS షో ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్. !!. ఎందుకంటే నేడు ఈ షోకు సంబంధించి అధికారిక ప్రోమో కాసేపటి క్రితం స్టార్ మా ఛానల్ వారు రిలీజ్ చేశారు.
🌐బిగ్ బాస్ షో : ఇటీవల కొన్నాళ్లుగా టెలివిజన్ ఛానల్స్ ప్రదర్శితమవుతున్న క్రేజీ షోల్లో స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్నBIGBOSS షో కూడా ఒకటి అని చెప్పవచ్చు. మొదట్లో ఇటువంటి షోలు మన తెలుగు ప్రేక్షకులు చూడరు, ఇది పాశ్చాత్య సంస్కృతి అంటూ పలు విమర్శలు ఎదురయ్యాయి. అయితే షో ప్రారంభమయిన తరువాత మెల్లగా అది మన ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం మొదలయింది.
🔴సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్ : ఇక ఈ షో సీజన్ 1 కు హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన హోస్టింగ్ టాలెంట్ తో షోకు మరింత వన్నె తెచ్చారని చెప్పవచ్చు.
🔴సీజన్ 2 కు నాని:
ఇక తరువాత ప్రసారమైన సీజన్ 2 కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది. అయితే ఆయన హోస్ట్ గా ఉన్న సమయంలో షో పై కొంత నెగటివ్ విమర్శలు వచ్చినప్పటికీ, చివరికి మాత్రం షో మంచి జోష్ తో ముగిసింది. ఇక అప్పటినుండి మన ప్రేక్షకులు మూడవ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
🔴 సీజన్ 3కు మన్మధుడు..?! : మన్మధుడు నాగార్జునను ఇక సీజన్ 3కు హోస్ట్ గా తీసుకున్నట్లు, ఆల్మోస్ట్ ఆయన కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
దీన్నిబట్టి అతి త్వరలో షో ప్రారంభం కానున్నట్లు అర్ధం అవుతోంది. అయితే అతి త్వరలో షో కి హోస్ట్ గా ఎవరు ఉండనున్నారు, ఇక షోలో పార్టిసిపెంట్స్ గా ఎవరెవరు పాల్గొననున్నారు వంటి తదితర వివరాలన్నీ మరికొద్దిరోజుల్లో వెల్లడి కానున్నట్లు సమాచారం.