Teluguwonders:
నగిరి ఎమ్మెల్యే రోజా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. వైసిపిలో కీలక నేత అయిన రోజా ఆ పార్టీ తరుపున వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. రోజా రాజకీయాల్లో కొనసాగుతూనే బుల్లితెరపై జబర్దస్త్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
రోజా రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆమె జబర్దస్త్ నుంచి తప్పుకుంటారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపించాయి. ఎన్నికల సమయంలో జబర్దస్త్ షోకు ఆమె కొంతకాలం దూరంగా ఉన్నారు. దీనితో రోజాకు సీఎం జగన్ కేబినెట్ లో బెర్త్ ఖాయం అనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. కానీ అనూహ్యంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీనితో రోజా తిరిగి జబర్దస్త్ షోలో న్యాయనిర్ణేతగా పాల్గొన్నారు.
జబర్దస్త్ షోలో జడ్జీలుగా రోజా, నాగబాబు జోడి బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ తప్ప మరొకరు ఆ షోలో ఇమడలేని పరిస్థితి. రోజాకు మంత్రి పదవి దక్కలేదు కాబట్టి ఆమె కొంతకాలం ఈ షోలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ తాజాగా ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇస్తూ రోజా జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలో జరగబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో జడ్జిగా రోజా కనిపించడం లేదు. ఆమె స్థానంలోకి శేఖర్ మాస్టర్ వచ్చారు. నాగబాబు కొనసాగుతున్నారు. దీనితో రోజా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసినట్లే అనే ప్రచారం జరుగుతోంది. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
రోజాకు రెండవసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయట. దీనితో పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి, కేవలం రాజకీయాలపైనే ఫోకస్ చేయడానికి రోజా జబర్దస్త్ ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.