అయ్యే పాపం రాహుల్‌ అంటున్న నెటిజన్లు

BIGBOSS
Spread the love

Teluguwonders:

బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణం సాగిస్తున్నట్లు అనిపిస్తూన్న రాహుల్‌-పునర్నవి జంటను బిగ్‌బాస్‌ విడగొట్టేశారు. టాస్క్‌ పేరిట వీరిద్దరిని ఒకరి నుంచి మరొకర్ని దూరం చేసేసారు అంతే కాకుండా.. రవి-పునర్నవిలకు హనీమూన్‌ వెళ్లే కొత్త జంట అనే క్యారెక్టర్లను ఇచ్చారు. దాంతో రాహుల్‌కు ఎక్కడో మండి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హౌస్‌లో చాలా సందర్భాల్లో వీరిద్దరి వ్యవహారంపై ఇంటి సభ్యులకు అనుమానం వచ్చేది. ఇద్దరూ ఒకే చోట ఉండటం.. పర్సనల్ విషయాలను పంచుకోవడం.. టాస్క్‌ల్లో కూడా సహాయపడటం.. దానికి తోడు రోజురోజుకి ఇద్దరు చాలా క్లోజ్‌ అవుతుండటం.. లాస్ట్ ఎపిసోడ్‌లో కూడా వరుణ్‌ సందేశ్‌, వితికాలు దానికోసమే మాట్లాడుకోవడం. టాస్క్‌లో భాగంగా.. తనకు త్యాగం చేశానని, కాబట్టి ఈ వారం అంతా తానేం చేసినా.. భరించాలని రాహుల్‌కు షరుతు పెట్టినట్లు వరుణ్‌తో పునర్నవి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాహుల్‌పై కాళ్లేసి మరీ .. పునర్నవి బెదిరించసాగింది.

ఈ సందర్భంలో వరుణ్‌, వితికాలు మాట్లాడుకుంటూ ఉండగా.. మాటల మధ్యలో ‘మనం అంటే వేరే.. మనం.. భార్యాభర్తలం.. వీళ్లది వేరే.. ఓ స్టేజ్‌కు వెళ్లే స్టేజ్‌లో ఉందని వరుణ్‌ హింట్‌ ఇచ్చాడు. అయితే వీటిని పునర్నవి, రాహుల్‌ లైట్‌గా తీసుకుని సరదాగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. రాహుల.. అంటూ కామెడీగా పాట పాడుకుంటూ ఏడ్పించసాగింది. ఏంటి ఆ లుక్కేంటి? వెనక్కి తిరిగి మాట్లాడకు అర్థమైందా? మూస్కొని ఉండు అంటూ పునర్నవి హెచ్చరిస్తుండగా.. సరసం అంటూ వరుణ్‌ మధ్యలోకి వచ్చారు.

ఇక ఇలాంటి సరదా సంభాషణలెన్నో ఈ హౌస్‌లో చోటుచేసుకున్నాయి. గతంలో డేటింగ్‌కు సంబంధించి, లవ్‌ ప్రపోజ్‌ గురించి ఎన్నో విషయాలపై వీరిద్దరు సరదాగా ముచ్చటించుకున్నారు. గెస్ట్‌గా వచ్చిన వెన్నెల కిషోర్‌ కూడా ఈ విషయంపైనే రాహుల్‌నుద్దేశించి ఫన్నీకామెంట్స్‌ చేశాడు. ఇక నాగార్జున గారు కూడా అప్పుడప్పుడు రాహుల్‌-పునర్నవిల ట్రాక్‌ గురించి మాట్లాడుతుండటం మనకు తెలిసిందే.

ఇన చలో ఇండియా టాస్క్‌లో భాగంగా.. పునర్నవి-రవి ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేశారు. డ్రైవర్‌గా రాహుల్‌ తనపని తాను చేసుకుంటూ పోయాడు. మధ్యలో వరుణ్‌ వెళ్లి.. రాహుల్‌-పునర్నవి ఇష్యూను తీసుకొచ్చాడు. శివజ్యోతి కూడా రాహుల్‌నుద్దేశించి బాధపడకంటూ సరదాగా కామెంట్‌ చేసింది. రాహుల్‌ వచ్చి తన ఫ్లాష్‌ బ్యాక్‌ అంటూ పూర్‌ బాయ్‌ అని పాట పాడటం.. తను పేదవాడ్ని అందుకే వదిలేసిందంటూ ఓ కల్పిత కథను చెప్పుకొచ్చాడు.

అయితే నెటిజన్లు మాత్రం ఈ సంఘటను సీరియస్‌గానే తీసుకున్నట్లు అనిపిస్తోంది. ట్రైన్‌లో రవి-పునర్నవిలు ఎంజాయ్‌ చేస్తుంటే.. రాహుల్‌ మాత్రం ఊరికే ఉండటంతో మీమ్స్‌తో ఫన్‌ క్రియేట్‌ చేస్తున్నారు.. వాళ్లిద్దరూ అంత అన్యోన్యంగా ఉండటంతో రాహుల్‌కు మండుతోందని, అయ్యే పాపం రాహుల్‌ అంటూ నెటిజన్లు రాహుల్‌కు మద్దతు పలుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *