కోడిని పౌరుషానికి గుర్తుగా చూపిస్తూ ఉంటారు . చరిత్ర చూస్తే ఒక కోడి పల్నాటి యుద్ధానికి కారణం అయింది . అందుకే మనకు సంక్రాంతి లాంటి పండుగలు వచ్చినప్పుడు తమ తమ గెలుపును నిరూపించుకోవడం కోసం కోడి పందాలు నిర్వహిస్తారు చాలా మంది.కోడి అంత విలువైనది వారికీ.కానీ ఈ కోడి అంత కన్నా విలువైనది.ఈ కోడి కొనాలంటేనే రూ.15లక్షలు కట్టాలి.. అసలు గుడ్డు ధరే వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. ఏంటా కోడి,ఏంటా కధ అంటే….
ఆ కోళ్ళు అందంగా ఉండటమే కాదు కోపం వస్తే పందెం కోడిలా ముందుకు కూడా దూకుతాయి..ఎందుకంటే అవి పర్లా జాతి కోళ్ళు ..ఆ కోడి ప్రత్యేకత గురించి వాటి పెంపకందారు.. కృష్ణమాచారి మాటల్లో…
🐓పర్లాం కోళ్లు :
అందం.. ఠీవీ.. వాటి సొంతం. అందాల పోటీల్లో ఎదురు లేదంటూ సత్తా చాటడానికి అవి సిద్ధం. అవే కోళ్ల జాతుల్లోని విభిన్నమైన పర్లా జాతి కోళ్ళు. మిగతా కోళ్ల కంటే విభిన్నంగా ఉంటూ.. జాతీయపక్షి నెమలి పోలికలు వీటికి ఉండటంతో పర్లా జాతి కోడికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపే వుంది. ప్రకాశం జిల్లా కంభం మండలంలో కృష్ణమాచారి అనే వ్యక్తి వీటిని ఎంతో ప్రేమగా పెంచుతున్నారు.
👉నెమలిని పోలి ఉండటం వాటి ప్రత్యేకత : ఠీవీగా రాజసం ఉట్టిపడేలా ఉండటమే గాక.. పలుచనైన చిలక లాంటి చిన్న ముక్కు.. మూడు అడుగుల తోక వుండి అచ్చం నెమలిని పోలి ఉండటం పర్లా జాతి కోళ్లకు అదనపు అందం. నెమలితో పాటు రెండు మూడు రకాల కోళ్ల జాతుల పోలికలు కలిగి వుండే పర్లా కోడి అందం మాటల్లో చెప్పలేనిది. సాధారణంగా కోడిపందాలలో ఉండే కాకి డేగ, తుమ్మెద కాకి, కోడి నెమలి, పచ్చకాకి, గరుడమైల వంటి పలు రకాల జాతులకు కోళ్ల కంటే ఈ జాతి కోళ్ళు పూర్తిగా భిన్నంగా వుంటాయి. దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ రకం జాతి కోళ్ళకు మంచి గిరాకి వుంది.
🐓 వాటి పోషణ :ఉదయాన్నే కోళ్లకు వ్యాయాయం చేయించడం, నీటి తొట్టిలో ఈత కొట్టిస్తారు. ఆ తర్వాత మిశ్రమ ధాన్యంతో పాటు బాదం పిస్తా, పప్పు, సొద్దలు, జొన్నలు, రాగుల ఆహరాన్ని ఈ కోళ్ళకు అందిస్తారు. పోషణలో మెళకువలు పాటించడం వలన శరీరాకృతిలో దృఢత్వాన్ని, ఆహార్యంలో చక్కదనాన్ని తేగలుగుతున్నాని కృష్ణమాచారి తెలిపాడు.
👉15లక్షలు పలికే పుంజు ;
కృష్ణమాచారి వద్ద ఉన్న సింహా అనే పుంజు ధర రూ.15లక్షలు పలుకుతుంది. దీన్ని బట్టి వీటికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం పర్లా జాతి పెట్టలే సుమారు లక్షల రుపాయలు ఖరీదు చేస్తాయి. పుంజులు అయితే మాత్రం లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఖరీదు ఉంటుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ నుంచి వచ్చి ఈ పర్లాం కోళ్ళను కొనుగోలు చేస్తారు. వీటి పెంపకాన్ని కొనుగోలు దారులు స్టేటస్ సింబల్ గా భావిస్తారు. దేశ వ్యాప్తంగా జరిగిన 🐓అందాల పోటీల్లో కూడా ; కోడి అందాల పోటీల్లో అనేక బహుమతులు ఈ పర్లా జాతి కోళ్ళు గెలుచుకోవడంతో వీటికి ఇంత మార్కెట్ ఏర్పడింది. ఇదండీ నెమలి లాంటి ఒక కోడి కథ.