Teluguwonders:
బిగ్ బాస్ హౌస్ లో రాహుల్, పునర్నవి ల గురించి అందరికీ తెలిసిందే. స్వయంగా పునర్నవే రాఖీ పండగ రోజు ఈ విషయాన్ని చర్చించింది. అయితే ప్రస్తుతం పునర్నవి తన ఆలోచనని విరమించుకున్నట్టుగా అనిపిస్తుంది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరూ మాస్క్ లు వేసుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నారని, ఆ మాస్క్ లు తీసేయాలని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ప్రతీ కంటెస్టెంట్ దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు.
నిన్నటి వరకు రాహుల్ తో సరదాగా, స్నేహంగా ఉన్న పునర్నవి అతన్ని నామినేట్ చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో రాహుల్ షాక్ అయ్యాడు. ఎందుకంటే రాహుల్, పునర్నవిలు మొదటి నుండి చాలా స్నేహంగా ఉంటున్నారు. అంతేగాక వారిద్దరి మధ్య రొమాంటిక్ డ్రామా నడుస్తుందని అందరికీ తెలుసు.
కానీ అనుకోకుండా ప్రోమోలో పునర్నవి రాహుల్ ని నామినేట్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు.
ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాహుల్ పునర్వవి అలా చేయడంతో అతని మొహం వాడిపోయింది. మరి దీని వెనక అసలు కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారు. అయితే గేమ్ ని గేమ్ లా ఆడతానని ఆమె ఇంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే. అదీగాక రాహుల్ వల్ల ఆమె గేమ్ పాడవుతుందని భావిస్తున్నట్టు కనబడింది. వీరిద్దరి స్నేహం బయటకి వేరేలా ప్రొజెక్ట్ అవుతుందన్న భయం ఎక్కువై దాన్ని ఇక్కడితో కట్ చేద్దామనే ఆలోచనతో ఆమె రాహుల్ ని నామినేట్ చేసి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు.
మరి రాహుల్ ని నామినేట్ చేయడం వల్ల ఆమె మాస్క్ ని పూర్తిగా తీసేసెనట్టే అనిపిస్తుంది. మరి రాహుల్ కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నాడో లేదొ తెలియదు.