లక్స్మిస్ ఎన్టీఆర్ కు లిరిక్స్ అందించిన సిరాశ్రీ అనే ఒక రచయిత రాంగోపాల్ వర్మ పై ఒక కవిత రాసాడు. మీకు అర్ధమయితే చదివేయ్యండి..
“ఆకాశంలోకి నిచ్చెన వేసుకుని మేఘాలపైకి వెక్కి కూర్చోగలడు
అల్లంత ఎత్తు నుంచి అమాంతం దూకేయగలడు
సరిగ్గా నేలను తాకే సమయానికి క్షణాల్లో రెక్కలు మొలిపించుకుని రివ్వున పైకి ఎగరగలడు
భోగిమంట అంత సంబరంగా చితి మంట వేసుకుని దూకేయగలడు
అంతలోనే ఫినిక్స్ పక్షిలాగా బూడిదలో నుంచి లేచి వచ్చేయగలడు
అసాంఘీక శక్తిగా కనిపిస్తూ మెదళ్లలో విస్పోటనం చేయగలడు
వెంటనే అవతార మూర్తిలా మారి జ్ఞాన ప్రభోదం చేయగలడు
శివుడిలా దెయ్యాలతో భూతాలతో ఆడుకోగలడు
ఇంద్రుడిలా ఓడ్కా అమృతం సేవిస్తూ సేద తీరగలడు
తత్వాన్ని దిగంబరంగా చూపించగలడు. ఛీఛీ అన్న నోటితోనే వారెవా అనిపించుకోగలడు
తన జీవితాన్ని తాను తప్ప ఇంకెవరినీ శాసించనీయడు. ఏ మనసుకు లొంగడు, ఆలోచనకు అందడు.
ఎవడు ఏమనుకున్నా ఎవడెటు పోయినా స్వేచ్ఛను గుండె నిండా పీలుస్తూ స్వాతంత్రాన్ని నరనరాన అనుభవిస్తూ
సమాజాన్ని ధిక్కరిస్తూ తన జవాబుతో అజ్ఞానం తొక్కతీస్తూ తన తెలివితో ప్రపంచాన్ని వెక్కిస్తూ
తనను అంచనా వేసేవారి గుడ్లు తేలేస్తూ జీవిస్తున్న ఒకే ఒక్క జీవి ఆర్జీవీ”
👉ఇదండీ ఆర్జీవీ పై సిరాశ్రీ రాసిన కవిత .చదివిన కొంత మంది మాత్రం “కవిత బాగానే ఉంది కానీ రచయిత rgv ని తిడుతున్నాడో.. పొగుడుతున్నాడో..అర్ధం అవ్వట్లేదని సెటైర్ వేస్తున్నారు…