బీచ్‌లో సన్నీలియోన్.. దుబాయ్‌కి సెగలే!

Spread the love

బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ ఏ డ్రెస్ ధరించినా అది సెక్సీగానే ఉంటుంది. చీర కట్టినా కూడా సన్నీని కళ్లప్పగించి చూసే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటిది సన్నీ బికినీ వేసుకుంటే తట్టుకోగలరా? తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ వెకేషన్ ట్రిప్ నిమిత్తం దుబాయ్ వెళ్లింది.

అక్కడి సముద్రంలో సన్నీ బికినీ వేసుకుని నీటిపై తేలియాడుతుంటే దుబాయ్‌కి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. బికినీలో క్లోజప్ షాట్ ఫొటోకు అభిమానులు ఫిదా అయిపోయారు. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను కూడా సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ముగ్గురు పిల్లలకు తల్లి అయిన సన్నీ.. తన భర్తతో కలిసి కాస్త ఏకాంత సమయాన్ని గడపాలని నిర్ణయించుకుంది. అందుకే పిల్లల్ని ఇంట్లోని ఆయాలకు అప్పజెప్పి కొన్ని రోజులు తన భర్తతో కలిసి ఎంజాయ్ చేసేందుకు దుబాయ్ వెళ్లింది. ఇటీవల సన్నీ తాను దత్తత తీసుకున్న నిషా మూడో బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిపింది.

మూడేళ్ల క్రితం మహారాష్ట్రలోని లాతూరు ప్రాంతానికి చెందిన ఓ అనాథాశ్రమం నుంచి ఓ ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నారు. పాపకు నిషా కౌర్ వెబర్ అని నామకరణం చేశారు. ఆ తర్వాత సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చారు. ఇఫ్పుడు సన్నీ జీవితం పరిపూర్ణం అయింది.

సన్నీ నిషాను దత్తత తీసుకున్నప్పుడు ఓ పోర్న్ స్టార్‌కు ఆడపిల్లలను ఎలా దత్తత ఇచ్చారు అని చాలా మంది నెటిజన్లు ఆమెను ఆడిపోసుకున్నారు. కానీ సన్నీ అలాంటివారి మాటలు అస్సలు పట్టించుకోలేదు.

ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూ మరోపక్క భార్యగా, తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. పోర్న్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సన్నీ ఇప్పుడు బాలీవుడ్ నటిగా పేరు తెచ్చుకున్నారు. సన్నీ వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు ప్రొఫెషనల్ కెరీర్‌ కూడా బాగా సాగిపోతోంది. ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రముఖ నటుడు నవదీప్‌తో కలిసి ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. తమిళంలో ‘వీరమహాదేవి’ అనే హిస్టారికల్ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరికొన్ని ఐటెం సాంగ్స్‌లోనూ నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *