గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి
భారీ రేంజ్‌లో ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. దక్షిణాదిన సైరాకు పోటీ లేదు కానీ.. బాలీవుడ్‌లో మాత్రం సైరాకు పోటీగా వార్
చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ నటించారు. గ్లామర్, యాక్షన్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో వార్
సినిమా కూడా భారీ అంచనాలతోనే విడుదలైంది. అయితే పాజిటివ్ టాక్ రాబట్టడంలో సైరా నరసింహారెడ్డి
కంటే వార్
వెనుకబడిందని సినీ వర్గాలు అంటున్నాయి. సైరా దక్షిణాది నేపథ్యంలో సాగే చిత్రమే అయినా బాలీవుడ్ నుండి సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. అయితే వార్
పాజిటివ్ రెస్పాన్స్‌ను రాబ్టటుకోలేదు. మరి కొన్ని గంటలు ఆగితే కలెక్షన్స్ పరంగా సినిమాల రేంజ్ ఏంటో కూడా తెలియనున్నాయి