బిగ్‌బాస్‌ 3 లో ఈవారం ఆ ముగ్గురిలో కెప్టెన్‌ కాబోయేదెవరు..?

Spread the love

Teluguwonders:

బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌ చలో ఇండియా టాస్క్‌ను పూర్తి చేసి .. వారి అనుభూతులను కెమెరాలో బంధించారు. ఈ ట్రిప్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌ శ్రీనగర్‌, చంఢీగర్‌, కోల్‌కతా, ముంబై, కొచ్చిలకు ప్రయాణించి ఇంటి సభ్యులు మార్గమధ్యంలో సరదా ముచ్చట్లు, ఆటపాటలతో సందడి చేశారు. ముంబై చేరుకున్నానక అక్కడ ఒక సినిమాను కూడా తెరకెక్కించారు. బాబా భాస్కర్‌ డైరెక్షన్‌లో తీసిని ఆ సినిమాలో రవికృష్ణ హీరోగా, అలీరెజా విలన్‌గా నటించారు.

మొత్తానికి ఏదో రకంగా సినిమాను కంప్లీట్‌ చేసిన హౌస్‌మేట్స్‌ .. ప్రెస్‌మీట్‌ లాంటిది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబా భాస్కర్‌కాస్త ఎమోషనల్‌ అయినట్లు కనిపించారు. వెండితెరపై ఎప్పుడు కనబడతారు అన్న ప్రశ్నకు కంటతడి పెడుతూ త్వరలోనే హీరోగా నటిస్తానని తెలిపారు. ఇక ఇంటిసభ్యులకు ఇచ్చిన కొన్ని టాస్కులను కూడా వారు పూర్తి చేశారు. కొచ్చిలో పీచు తీయండి.. టెంకాయ వేయండి టాస్క్‌లో బాబా భాస్కర్‌ గెలవగా.. రాణీ మెడలో రత్నాల హారం టాస్క్‌లో మహేష్‌ గెలిచారు.

ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు దిగిన ఫోటోలు, వీడియోలను ప్లే చేసి చూపించారు బిగ్ బాస్. అనంతరం ఈ టాస్క్‌లో బెస్ట్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చిన ముగ్గురు సభ్యుల పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పమని బిగ్ బాస్ అదేశించాగా.. వరుణ్‌, రాహుల్‌, బాబా భాస్కర్‌ల పేర్లను ఇంటి సభ్యులు అందరు ఏకాభిప్రాయంతో తెలిపారు. దీంతో ఈ ముగ్గురుకి ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ను పెట్టనున్నట్లు ప్రకటించారు. మట్టిలో ఉక్కు మనిషి అనే ఈ టాస్క్‌లో ఎవరు గెలుపొంది.. కెప్టెన్‌గా ఎన్నికవుతారో చూడాలి. రెండో సారి కెప్టెన్‌గా ఎన్నికై వరుణ్‌ రికార్డు సృష్టిస్తాడా? లేదా బాబా భాస్కర్‌, రాహుల్‌లో ఎవరో ఒకరు కెప్టెన్‌ పదవిని పొందుతారా? అన్నది ఈ రోజు చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *