V10..వరుణ్ తేజ్ కొత్త సినిమా మొదలైపోయింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది.
వరుణ్. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న సినిమాలో వరుణ్ నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు ఫిలిం నగర్ గుడిలో జరిగింది. డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఎస్ తమన్ సినిమాకుసంగీతంఅందిస్తారు.గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వరుణ్ నటించబోతున్న పదో సినిమా ఇది. ఇందులో వరుణ్ బాక్సర్ పాత్రలో నటించనున్నారు. అయితే ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు అన్న విషయం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
ఇప్పటివరకు వరుణ్ కెరీర్‌లో కుంగిపోయేంత ఫ్లాప్ ఏ సినిమాకూ రాలేదు. 2000లో ‘హ్యాండ్స్ అప్’ అనే సినిమాలో వరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. ఆయన అసలు కెరీర్ 2014లో వచ్చిన ‘ముకుంద’తో మొదలైంది. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. కానీ వరుణ్ తర్వాత రిస్క్ చేసి మరీ ‘కంచె’ సినిమాకు సంతకం చేశారు. రెండో సినిమాలోనే ఆర్మీ అధికారి గెటప్ ఎత్తారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో విజయం సాధించింది. అంతేకాదు సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక్కడి నుంచి వరుణ్ ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూవచ్చారు.మధ్యలో ఆయన ‘లోఫర్’ వంటి కొంటె కుర్రాడి పాత్రలు ఉన్న సినిమాల్లో నటించినప్పటికీ ఆయనకున్న ఇమేజ్ పెరుగుతూనే వచ్చింది.
ఇక ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’ సినిమాలు వరుణ్ కెరీర్‌కు మైలేజ్ ఇచ్చాయి. అప్పటివరకూ రొమాంటిక్ కుర్రాడిలా కనిపించిన వరుణ్ ‘గద్దలకొండ గణేష్’ అంటూ ఊరమాస్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా వరుణ్ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. ఇప్పుడు తన కొత్త సినిమాతో బాక్సర్ పాత్రలో నటించనున్నారు. ఈసారి కూాడా తన బాక్సింగ్ పంచ్‌లకు బాక్సాఫీస్ బద్దలైపోతుందో లేదో చూద్దాం.