వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇచ్చిన యాంకర్‌శిల్పాచక్రవర్తికి ఝలక్ ఇచ్చిన బిగ్‌బాస్ Episode 44 Highlights

Spread the love

Teluguwonders:

బిగ్‌బాస్ హౌస్‌లో వినాయక చవితి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంటి సభ్యుల నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అలాగే ఇంటిలోకి కొత్త సభ్యురాలు వైల్డ్ కార్డుగా వచ్చి అందరికీ ఝలక్ ఇచ్చింది. నూతన సభ్యురాలి రాకతో కొత్త వాతావరణం ఇంటిలో కనిపించింది.

🕉ఇంటిలో గణేష్ పండుగ సందడి :

ఇంటిలోకి పూలు, పండ్లు, పత్రాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఇంటి సభ్యులు కెమెరా ముందుకు వచ్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వినాయక పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకొన్నారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కాన్షెషన్ రూమ్‌లోకి ఇద్దరిద్దరిని పిలిచారు.

👉నామినేషన్ ప్రక్రియ:

నామినేషన్ ప్రక్రియలో భాగంగా తొలుత రవికృష్ణ, ఆలీ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడకు వెళ్లగానే చీకటిలో ఓ యువతి కూర్చుని ఉన్నట్టు టెలివిజన్‌లో కనిపించింది. ఆ అమ్మాయి ఆ ఇద్దరి గురించి ప్రస్తావించడమే కాకుండా వారి లోపాలను ఎత్తి చూపింది. అనంతరం వారిద్దరిని తనకు నచ్చని వ్యక్తిని నామినేట్ చేయమని అడిగింది. మహేష్‌ను రవికృష్ణ, రాహుల్‌ను అలీ నామినేట్ చేశారు.

🔴వితిక, పునర్నవి నామినేషన్ :

ఆ తర్వాత పునర్నవి, వితికను గదిలోకి పిలిచారు. నీ ముఖం ఆనందంతో ఎందుకు వెలిగిపోతున్నదని పునర్నవిని అడుగగా ఇప్పుడు అందరితో కలిసిపోయాను. హ్యాపీగా ఉందని చెప్పింది. ప్రతీ విషయాన్ని ఎందుకు భూతద్దంలో చూస్తావు అని వితికపై యువతి సెటైర్ వేసింది. వితికను నామినేట్ చేయమనగా శ్రీముఖిని, అలీని పునర్నవి నామినేట్ చేశారు.

🔴రాహుల్‌కు వార్నింగ్ :

అనంతరం రాహుల్, మహేష్ విట్టను నామినేషన్ ప్రక్రియ కోసం గదిలోకి పిలిచారు. వారిద్దరి లోటుపాట్లను ఎత్తి చూపుతూ యువతి ప్రశ్నించింది. బూతులు మాట్లాడవద్దని యువతి రాహుల్‌కు సలహా ఇచ్చింది. ఫాల్తూ మాటలు మాట్లడం మంచికాదు అని చెప్పింది. దాంతో టాస్క్‌లో భాగంగానే చేశానని రాహుల్ చెప్పాడు. శ్రీముఖిని తిట్టినప్పటికీ.. ఆ తర్వాత సారీ చెప్పానని అన్నారు. అనంతరం రాహుల్‌ను నామినేట్ చేయమనగా శ్రీముఖిని, అలీని మహేష్ నామినేట్ చేశారు.

🔴శ్రీముఖి, బాబా భాస్కర్‌ లపై చీకటి యువతి సీరియస్ :

ఇక మిగిలిన వారిలో బాబా భాస్కర్, శ్రీముఖిని కన్ఫెషన్ గదిలోకి పిలిచారు. అయితే వారిద్దరూ ఆ రహస్య స్నేహితురాలితో మస్తు మజాక్‌లు ఆడారు. శ్రీముఖి, బాబా ఆ యువతిపై సెటైర్లు వేయగా.. వాటిపై యువతి సీరియస్ అయింది. అనంతరం బాబా భాస్కర్‌ను నామినేట్ చేయమని అడుగగా అలీని, శ్రీముఖి.. రాహుల్‌ను నామినేట్ చేశారు.

🔴బాబా భాస్కర్ అనుమానం :

చివరిగా కెప్టెన్ వరుణ్ సందేశ్‌ను పిలిచారు. ఇంటిలోని సభ్యులను ఇద్దరిని నామినేట్ చేయమని అడుగగా.. మరో ఇద్దరిని నామినేట్ చేశారు. దాంతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆ యువతి ఎవరనే విషయం అందర్ని వెంటాడింది. రెజీనా కసండ్రానా అంటూ బాబా భాస్కర్ అనుమానం వ్యక్తం చేశారు.

💥ఆమె శిల్పా చక్రవర్తి..:

ఇక చీకటి ముసుగును ధరించిన యువతి ఇంటిలోకి ప్రవేశించింది. తలుపు చాటు నుంచి మెల్లగా వచ్చి హిమజను భయపెట్టింది. ఇంటిలోనికి వచ్చిన యువతి యాంకర్ శిల్పా చక్రవర్తి కావడంతో అందరూ సంతోషంలో మునిగిపోయారు. తన గొంతును గుర్తు పడుతారేమోనని భయపడ్డానని శిల్పా చక్రవర్తి చెప్పింది. శిల్ప రాకతో కొత్త వాతావరణం కనిపించింది.

🔴ఇరుకున పడ్డ శిల్పా చక్రవర్తి :

ఇంటిలోకి వచ్చిన శిల్పా చక్రవర్తికి బిగ్‌బాస్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమెను ..మరో ఇద్దరిని నామినేట్ చేయమని అడిగాడు. బిగ్‌బాస్ సూచన మేరకు అలీ, శ్రీముఖిని ఆమె నామినేట్ చేశారు.
దాంతో శిల్పా చక్రవర్తి ఇబ్బందికి గురైంది. 👉 ఈ వారం నామినేట్ అయిన వారిలో మహేష్ విట్ట, రవికృష్ణ, రాహుల్, అలీ రెజా, శ్రీముఖి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *