ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 4600 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన విహార నౌకను కొన్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది.
“గత ఏడాది మొనాకోలో జరిగిన యాట్ షోలో ఆ నౌక పూర్తిగా పర్యావరణ అనుకూలమన్న సంగతి తెలిసిన వెంటనే ముచ్చటపడి ఆర్డర్ ఇచ్చేశారు. సుమారు 370 అడుగులు ఉండే ఈ నౌక పేరు ఆక్వా. అందులో నాలుగు గెస్ట్ రూంలు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్ ఉంటాయి.
ద్రవ హైడ్రోజన్‌తో నడిచే ఈ నౌకలో ఒక్కసారి ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. మొత్తం సిబ్బంది సంఖ్య 31 కాగా 14 మంది అతిథులకు సరిపడా ఏర్పాట్లున్నాయి.
జిమ్, యోగారూమ్, మేకప్ రూమ్, స్విమ్మింగ్ పూల్ అలాగే నౌక నుంచి సముద్రంలోకి వెళ్లి విహరించేందుకు రెండు చిన్న బోట్లు కూడా ఉన్నాయి” అని ఆంధ్రజ్యోతి ఈ వార్తలో వివరించింది.
ఇవి కూడా చదవండి
ఆస్కార్ అవార్డులు 2020: ఉత్తమ నటుడు జాక్వీన్ ఫీనిక్స్, ఉత్తమ నటి రెనె జెల్వెగర్
దిల్లీ ఎన్నికల్లో గెలుపెవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి