*అంతరిక్షం చప్పుడు వింటారా!*
*పై వీడియో లో ఉంది*
వాషింగ్టన్: అంతరిక్షంలోని అద్భుతాలను వీక్షించాలని, వాటి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆస్తకి ఉంటుంది. అందుకు తగ్గట్టే నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఆశ్చర్యపర్చే దృశ్యాలను నెట్టింట్లో ఉంచుతుంది. వాటి ద్వారా అంతరిక్షం గురించి కాస్త అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అయితే, ఈసారి మాత్రం నాసా హబుల్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన దృశ్యాల్లో మనకు ఒకరకమైన శబ్దం కూడా వినిపిస్తోంది. _‘హబుల్ అబ్బురపరిచే అంతరిక్ష దృశ్యాలను మన ముందుకు తీసుకువచ్చింది. వాటితో కళ్లకే కాదు, ఇతర ఇంద్రియాలకు గొప్ప అనుభవం కలగనుంది! అంతరిక్షంలో శబ్దం లేదని భావించినప్పటికీ ఇదో కొత్త అనుభవం. 30 నుండి 1,000 హెర్ట్జ్ వరకు ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీ చిత్రం దిగువ నుండి పైకి మారుతుంది. ’ అంటూ నాసా ఓ వీడియోను షేర్ చేసింది. ఇది నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే 2.5 లక్షల మంది దీన్ని వీక్షించడంతో పాటు, ప్రశంసనీయ వ్యాఖ్యలు చేశారు._