267 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎపిపిఎస్‌సి
ప్రజాశక్తి , ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపిపిఎస్‌సి) ఈ నెల 26న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షకు 1,14,473 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 258 పరీక్ష కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది. అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 16,642 మంది అభ్యర్థులు గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి 15,888 మంది, గుంటూరు నుంచి 12,158 మంది, కర్నూలు నుంచి 11,611 మంది దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో 44, కర్నూలులో 32, కృష్ణాలో 31 కేంద్రాలను ఎపిపిఎస్‌సి ఏర్పాటు చేసింది.
26న ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్ష జరగనుంది. 2018 డిసెంబర్ 31న 169 పోస్టులకు ఎపిపిఎస్‌సి గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 44 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండగా, 125 కొత్త పోస్టులు ఉన్నాయి.