*పదో తరగతితో సీఎస్‌ఐఓ డిప్లొమాలు!* పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరికరాలను ఉపయోగించగలిగిన కిందిస్థాయి నిపుణులను సిద్ధం చేసే లక్ష్యంతో కొన్ని రకాల డిప్లొమాలను సీఎస్‌ఐఓ రూపొందించింది. రకరకాల స్పెషలైజేషన్లతో వీటిని అందిస్తున్నారు. పదోతరగతి అర్హతతో ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్ఛు. సీఎస్‌ఐఆర్‌కు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్‌ఐఓ) ఆధ్వర్యంలోని ఇండో స్విస్ శిక్షణకేంద్రం డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమాల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి విద్యార్థులు వీటికి అర్హులు. రాతపరీక్షలో ప్రతిభ చూపినవారిని కోర్సులోకి తీసుకుంటారు. సీఎస్‌ఐఓ శిక్షణ కేంద్రంలో వివిధ కోర్సులను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి చక్కని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హోండా, గోద్రెజ్, ఫిలిప్స్, సోనాలిక, ఐషర్, సిమెన్స్, ఐబీఎం, హెచ్‌సీఎల్, విప్రో, హావెల్స్, జీఈ తదితర ఎన్నో సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. *కోర్సులు* * అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ * అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ *ఈ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. ఒక్కో విభాగంలో 15 చొప్పున సీట్లు ఉన్నాయి* * డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ * డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ (టూల్ అండ్ డై) *ఈ కోర్సుల వ్యవధి మూడేళ్లు. ఒక్కో దాంట్లో 55 చొప్పున సీట్లు ఉన్నాయి.* మొదటి ఏడాది అందరికీ ఉమ్మడిగా శిక్షణ ఉంటుంది. తర్వాత రెండేళ్లు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్రాంచీల వారీ తరగతులు ఉంటాయి. అడ్వాన్స్‌డ్ డిప్లొమా వారికి చివరి ఏడాది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన మెషీన్లు, ఎక్విప్‌మెంట్‌పై శిక్షణ అందిస్తారు. కోర్సు మొత్తం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారం బ్రాంచీలు కేటాయిస్తారు. మెరిట్ విద్యార్థులకు, ఆర్థిక అవసరాలు ఉన్నవారికి స్ట్టైపెండ్ చెల్లిస్తారు. *పరీక్ష విధానం* మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ సీబీఎస్‌ఈ పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం తగ్గిస్తారు. *అర్హత:* పదో తరగతి ఉత్తీర్ణులు, ప్రస్తుతం పరీక్ష రాయబోతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు *వయసు* : ఆగస్టు 1, 2001 తర్వాత జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీలైతే ఆగస్టు 1, 1998 తర్వాత జన్మించినవారికీ అవకాశం ఉంటుంది. *వెబ్‌సైట్:* http://istc.ac.in/ *ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ* : జూన్ 15, 2020. *పరీక్ష తేదీ: జులై 19, 2020*