అవును ఆ జైలు లో 29 మంది ఖైదీలను చంపేసారు.
👉విషయం లోకి వెళ్తే : రాజధాని దుషాన్బేకు 25 కిలోమీటర్ల దూరంలోవాహదత్ నగరంలో ఈ ఘటన జరిగింది . మే 19వ తేదీన తజకిస్తాన్ జైలులో అల్లర్లు జరిగాయి .కాగా ఈ అల్లర్లలో మొత్తం 32 మంది మృతిచెందినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. మృతిచెందినవారిలో 29 మంది ఖైదీలు ఉన్నారు.
👉ఘర్షణ కు కారణం తీయట్లేదు : కారణం తెలియదు కానీ సుమారు అరగంట పాటు కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు ఖైదీలకు చెందిన కుటుంబీకులు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఖైదీలు ముగ్గురు సెక్యూర్టీ గార్డులను కూడా చంపేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఘటనపై విచారణకు ఆదేశించారు.