ఈ మే నెల లో…3 వేసవులు : వేసవి కాలంలోనే మే వస్తుంది కదా, మరి కొత్తగా మే నెలలో 3 వేసవులు ఏంటా అని ఆలోచిస్తున్నార…ఆక్కడికే వస్తున్న…ఇక్కడ 3 వేసవులు అంటే ఈ మే నెల లో జరిగే 3 అత్యంత హాట్ టాపిక్స్ వాటిలో మొదటిది
☑1🔅May 9: Superstar మూవీ : ఈ సమ్మర్ లో..ఇప్పటికే నాని నటించిన ‘”జెర్సీ”.. ,ప్రేమ జంట నాగ చైతన్య సమంత ల మజిలీ లారెన్స్ కాంచన(ముని) సిరీస్ లోని కాంచన3 విడుదల అయ్యాయి. నాని నటించిన “జెర్సీ”family ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది .ప్రేమ జంట నాగ చైతన్య సమంత ల మజిలీ కూడా మంచి మార్కులు తెచ్చుకుంది.ఇక(ముని) కాంచన సిరీస్ లో వచ్చిన లారెన్స్ కాంచన3 కి కూడా థియేటర్స్ బాగానే నిండుతున్నాయి. కానీ వీటన్నింటి లోనూ ఈ నెల 9న రిలీజ్ అవబోతున్న మహర్షి మూవీ చాలా హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఇది మహేష్ నటించిన prestigious 25 వ చిత్రం కావడం ఒక విశేషం అయితే. “ఊపిరి” సక్సెస్ తర్వాత వంశీ పైడిపల్లి నుంచి వస్తున్న చిత్రం కావడం..మరొక విశేషం .మహేష్ స్టూడెంట్ గా,రైతుగా ,ఒక బిజినెస్ ఐకాన్ గా 3 షెడ్స్ లో కనిపించడం..ఇప్పటికే రిలీస్ అయిన టీజర్, ట్రైలర్,దేవిశ్రీప్రసాద్ సంగీతం లోని కొత్తదనం..ఇవన్నీ కలిసి ఈ సినిమా కి విపరీతమైన హైప్ ని తీసుకువచ్చాయి.ఈ వేసవి లో ఇప్పటి దాకా రిలీజ్ ఆయిన చిత్రాల్లో.. మహర్షి అగ్ర హీరో సినిమా కావడం తో..ఈ సినిమా విజయం గురించి ఈ మే నెల మరింత heat ఎక్కింది.☑ఇక రెండవది ఈ సమ్మర్ హీట్ ని మరింతగా పెంచేది.
2🔅 May 23ఎలెక్టన్స్ results : అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న మొన్నటి April 11 న జరిగిన లోక్ సభ..ఎలక్షన్స్ ..ఫలితాలు ఈ మే 23న విడుదల అవుతుండడం..
ఎంతో అనుభవం ఉండి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రాన్ని గత 5ఏళ్లుగా పాలించిన చంద్రబాబు నాయుడు కి,ఒక్క అవకాశం ఇస్తే మరో 5 ఏళ్ళు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా..అంటున్న జగన్ మోహన్ రెడ్డికి..ఈ ఫలితాలు..చాలా కీలకం గా మారడంతో.. ఎవరు నెగ్గుతారో తెలుసు కునే క్రమం లో..ఆంధ్రా వాతావరణం మూడింతలుగా వేడెక్కింది..ఫలితాలు వచ్చేవరకు ఈ వేడి అస్సలు చల్లారదు.🔅ఇక మూడవది చివరిది అయిన hot topic
☑3.🔅రోహిణీ కార్తె : ఎండలంటేనే భయపడి పోయే సాధారణ జనాలు ఇక రోహిణి కార్తె పేరు వింటేనే హడలిపోతారు.తమ తమ ఇళ్ల నుంచి చాలా ముఖ్యమైన పని ఉంటేనే తప్ప బయటకు రారు. అలాంటి రోహిణి కార్తె ఈ నెల 25నుండి మొదలయ్యి వచ్చే నెల 8 వరకు తన వేడి వేడి ప్రతాపాన్ని కొనసాగిస్తుంది..ఇవి ఈ నెల లో వచ్చే 3 వేసవులు..ఇవి entertainment ని పంచడంతో పాటు..కొద్దిగా టెన్షన్ ని కూడా పెడతాయి.🔅