ఈ పూలు అవి పూసిన చోట కరువుని సృష్టిస్తాయా.. అసలేంటా సంగతి అంటే ;
♦40 ఏళ్ళకి ఒకసారి పూచే వెదురు పూలు : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌తో పాటు అటవీప్రాంతమంతటా చాలా ఏళ్ల తరువాత వెదురు పూలు కనిపిస్తున్నాయి. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం వ్యక్తంచేస్తుండగా, మరోవైపు ఇది రానున్న విపత్తుకు చిహ్నమని భావిస్తూ ఆందోళన చెందుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సంభవిస్తుందని ఇక్కడి వృద్ధులు చెబుతుంటారు. కాగా
👉వీటి ఉపయోగం : గ్రామస్తులు ఈ పూలను ఏరి, వాటిని ఆహారంలో వినియోగిస్తుంటారు. ఆ పూలను పౌడర్‌గా చేసి, రొట్టెలు తయారు చేస్తుంటారు. ఈ పూలలో పౌష్టిక తత్వాలు ఉన్నాయని చెబుతుంటారు. సాధారణంగా వెదురు చెట్లు 40-45 ఏళ్లకు పూలు పూస్తుంటాయి. కాగా 🔸మహాసముంద్ జిల్లాకు చెందిన హృదయ్‌లాల్ ఖాఖ్రే(66) మాట్లాడుతూ : వెదురు పూలు పూయడం వాటి మొక్కలకు, చెట్లకు నష్టమని, ఈ విషయాన్ని తమ పూర్వీకులు తెలిపారన్నారు. 1979లో ఇలాగే వెదురుపూలు విరగబూశాయని, అప్పట్లో కరువు కాటకాలు సంభవించాయన్నారు. 🔸సరాయ్‌పాలీ ప్రాంతానికి చెందిన పురుషోత్తమ్(80) మాట్లాడుతూ : తాను వెదురుపూలు ఇలా విరగబూయడాన్ని మూడవసారి చూశానని, తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు తన తాత వీటిని చూపించాడన్నారు. ఇవి ఇలా విరగబూయడాన్ని అశుభంగా భావిస్తామని తెలిపారు. కాగా
👉దీనిపై శాస్త్రవేత్తల వివరణ: వెదురుపూల గురించి మాట్లాడుతూ సాధారణంగా వెదురు పూలు 40 నుంచి 50 ఏళ్లకు ఒకసారి పూస్తాయని, అప్పుడు వెదురు ఎండిపోతుందని తెలిపారు. ఇది సర్వసాధారణమని, దీనిపై లేనిపోని నమ్మకాలు కల్పించుకోవడం తగదన్నారు. ఇదీ అసలు సంగతి. కానీకొన్ని మూఢ నమ్మకాలు తర తరాలుగా కొంత మంది ఆస్తి అంతే..