టీవీ9లో నాకు తెలియకుండానే నా షేర్లు అమ్మేశారు అని వాపోతున్నాడు హీరో శివాజీ…అవును హీరో శివాజీ టీవీ9లోషేర్ హోల్డర్.చాల మందికి ఈ విషయం తెలియదు.టీవీ9లో హీరో శివాజీకి వాటాలున్నాయి.అయితే తన షేర్లు ఎవరో అమ్మేశారంటూ తెలిసిన వెంటనే ఆయన ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.శివాజీ వాటాలు అమ్మకూడదంటూ ట్రైబ్యునల్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.టీవీ9లో శుక్రవారం చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రవిప్రకాశ్ ను సీఈవో పదవి నుంచి తొలగించారు. తాజాగా ఈ వ్యవహారంలో హీరో శివాజీ అంశం కూడా తెరపైకి వచ్చింది. టీవీ9లో తాను మైనార్టీ షేర్ హోల్డర్ నని… తనకు తెలియకుండానే తన షేర్లను అమ్మేశారని ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను శివాజీ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, టీవీ9 వాటాలను కొనవద్దని ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగానే యాజమాన్యం బదిలీ కావడం గమనార్హం.దీంతో tv9 పరువు రచ్చకెక్కింది….