మీరు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు యూజర్లా..ఇంతవరకూ తక్కువ ధరకే డేటాను పొందుతున్న మీ జేబుపై మరింత భారం పడనుంది ఎయిర్‌టెల్ అధికారిక ప్రకటన విడుదల చేయక పోయినా జరిగేది ఇదే . ఔను దేశంలో ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ సంస్థ తన మొబైల్ ఖాతాదారులపై పెనుభారాన్ని మోపేందుకు సిద్ధమవుతోంది.
👉 అనేక ప్యాక్‌లను రద్దు చేయబోతున్న airtel : దేశంలో రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎయిర్‌టెల్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఒక్కో కస్టమర్ నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్పీయూ – యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.
♦ఇందులోభాగంగా రూ.499 కన్నా తక్కువగా ఉండే స్కీమ్‌లను తొలగించేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతకన్నా ఎక్కువగా ఉండే రూ.749, రూ.999, రూ.1,599 స్కీమ్‌లను మాత్రమే సంస్థ కొనసాగిస్తుందని తెలుస్తోంది.
♦ఇప్పటికే నిలిపివేసిన స్కీమ్‌లు :
ఇప్పటికే రూ.299 పోస్ట్ పెయిడ్ స్కీమ్‌ను నిలిపివేసిన ఎయిర్‌టెల్, అతి త్వరలో రూ.349, రూ.399 ప్యాక్‌లనూ నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, నో డౌట్..*జనం వెంటనే నెట్వర్క్ మారిపోతారు ..