(RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
RGUKT Recruitment Notification | నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 21
దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేదీ అక్టోబరు 24
బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
◊గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంజినీరింగ్, నాన్–ఇంజినీరింగ్)
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, తెలుగు.
విభాగాలు: మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, NEA లేదా ఆఫీస్ వర్క్స్/డాక్యుమెంటేషన్ అక్రిడిటేషన్ సంబంధిత విభాగం.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ బీఈ, ఎంటెక్/ ఎంఈ ఉత్తీర్ణత, మాస్టర్ డిగ్రీ, నెట్/స్లెట్/సెట్/పీహెచ్‌డీ.
జీతం: రూ.30,000.
◊ నాన్–టీచింగ్ పోస్టులు
◊ గెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్
విభాగాలు: మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, NEA లేదా ఆఫీస్ వర్క్స్/డాక్యుమెంటేషన్ అక్రిడిటేషన్ సంబంధిత విభాగం.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ బీఈ, ఎంటెక్/ఎంఈ, ఎంసీఏ.
జీతం: రూ.20,000.
◊ స్టెనోగ్రాఫర్
విభాగం: ఆఫీస్.
అర్హత: డిగ్రీ అర్హత ఉండాలి. స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ గ్రేడ్ షార్ట్‌హ్యా్ండ్, హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ పాసై ఉండాలి.
జీతం: రూ.20,000.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 డిడి తీయాలి. “The Director, RGUIIIT-Basar” పేరిటి డిడి తీయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్ కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.10.2019.
దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది: 24.10.2019