కోవాగ్జిన్‌కు 60 శాతానికి పైగా సమర్థత!

Spread the love

*కోవాగ్జిన్‌కు 60 శాతానికి పైగా సమర్థత!* దిల్లీ: కొవిడ్‌ నిరోధానికి తాము అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ సమర్థత 60 శాతానికి పైగానే ఉంటుందని హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)తో కలిసి భారత్‌ బయోటెక్‌ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి విదితమే ఈ వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో 26,000 మంది వలంటీర్లు భాగస్వాములవుతున్నారు. ‘కనీసం 60 శాతం సమర్థత సాధించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంతకన్నా అధిక సమర్థతనే కోవాగ్జిన్‌ కలిగి ఉండొచ్చు’ అని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి.సాయిప్రసాద్‌ పేర్కొన్నట్లు సీఎన్‌ఎన్‌-న్యూస్‌ 18 వెల్లడించింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్‌ఎఫ్‌డీఏ, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ మండలి కూడా శ్వాస సంబంధ వ్యాక్సిన్లు కనీసం 50 శాతం సమర్థతను కలిగి ఉంటే, వినియోగానికి ఆమోదం తెలుపుతాయి’ అని కంపెనీ వివరించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *