బర్త్‌డే కేకు ముఖానికి పూసుకుంటున్నారా… అయితే జైలుకి వెళ్లక తప్పదు…బర్త్ డే పార్టీ జరుపుకుంటే జైలు కేంటి అని ఆలోచిస్తున్నారా..!!!
బర్త్‌డే సెలబ్రేషన్ అంటే చాలు… పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి ముఖాన్ని కేక్‌తో ముంచేస్తారు చాలామంది. కేక్‌ను అటు ఇటు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పూసేస్తుంటారు స్నేహితులు. అయితే ఇకపై అలా చేస్తే నేరంగా పరిగణిస్తారు. అవును… వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా హెచ్చుమీరుతున్న బర్త్‌డే సెలబ్రేషన్స్ వేడుకలను కట్టడి చేసే ఉద్దేశంతో పుట్టినరోజు వేడుకలపైనా నిబంధనలు వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు గుజరాత్ రాష్ట్ర పోలీసులు. అక్కడ గనుక ఇది సక్సెస్ అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ త్వరలో ఇవే రూల్స్ రావచ్చు.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో బర్త్‌డే వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ నగర పోలీస్ కమీషనర్.బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ముఖానికి కేక్ పూసినా, ఫోమ్ స్ప్రే వాడినా… వారిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షిస్తామని సర్క్యూలర్ జారీ చేశారు.
పుట్టినరోజు వేడుకలపై ఇలాంటి కఠిన ఆంక్షలు పెట్టడానికి కారణం అక్కడ కొన్నిరోజుల కిందట జరిగిన ఓ సంఘటనే!
సూరత్‌లోని ఇమాస్ రోడ్డులో కొంతమంది యువతీ, యువకులు కలిసి ఓ వ్యక్తి బర్త్‌డే వేడుకను ఘనంగా నిర్వహించారు.అయితే వేడుకల్లో పాల్గొన్నవారంతా ముఖానికి కేక్ పూసుకుని, స్ప్రే కొట్టుకుంటూ గుడ్లు విసురుకుంటూ ఆ ప్రదేశాన్నంతా రచ్చరచ్చ చేశారు.ఇదంతా రహదారి పై జరగడం తో ఆ రహదారి పై వెళ్ళే వాళ్ళందరూ జారీ పడ్డారు.కొంత మందికయితే ఎముకలు విరిగాయి కూడా.దీంతో అలెర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం అప్పటి నుండి అక్కడ ఈ విధమైన birthday party’s ని నేరం గా పరిగణించి నిలిపి వేసారు.అతిక్రమించిన వారికీ జైలు దీక్షను కూడా ఖరారు చేసారు. దాంతో ఈ విధమైన birthday party’s అక్కడ ఆగిపోయాయి.మరి ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు వస్తుందో..