శ్మశాననికి పగలు వెళ్లటానికే బయపడతాం. కానీ ఒకతను రాత్రి పూట వెళ్ల వలిసి వచ్చింది..
🔅అది రాత్రి పదకొండున్నర… ఒడిశాలోని డెప్పిగుడలో ఉన్న శ్మశానం పక్కగా వెళ్తున్న ఆ వ్యక్తికి లోపల ఎవరో తిరుగుతున్నట్లనిపించింది. చూస్తే దహన సంస్కారాలు జరుగుతున్న ఆనవాళ్లు కూడా ఏవీ కనిపించ లేదు. పైగా వాళ్లు దహనవాటిక దగ్గర కూర్చుని అన్నం లాంటిదేదో తింటున్నారు. దాంతో అతడికి గుండెదడ పెరిగి, పరుగందుకున్నాడు. ఇంతకీ అక్కడున్న దెవరు..?అసలక్కడ ఎం జరుగుతుంది..?అలాగని అక్కడున్న వారు వాళ్ళు అగోరాలూ కాదు,అమాయకులు.. 😳అసలు వాళ్ళెవరు.. అక్కడ ఏం జరుగుతుంది
అవును ఆ స్మశానం లో ఉన్నవారు అఘోరాలు కాదు అమాయకులు .మరి స్మశానం లో ఎందుకు ఉంటున్నారంటే దానికో లెక్కుంది ,ఆ లెక్క ఏంటంటే ఆ స్మశానం చనిపోయిన వారికే కాదు బ్రతికున్నవారికి కూడా ఆశ్రయం ఇస్తుంది .అవును ఇది నిజం అది కూడా ఒకళ్లకు ఇద్దరకు కాదు.. 150 పైగా జనాభా కి ..అది కూడా ఎన్నో ఏళ్లుగా ఆ స్మశానం వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తుంది .అక్కడ ఆశ్రయం పొందే వాళ్లలో మగవాళ్లు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఉంటారు . మరి స్మశానంలో ఉండడానికి వాళ్లకు భయం వేయదా అంటే పేదరికంలో ఉన్నవారిని ఆకలి బాధ భయపెట్టినట్టుగా మరేది బయపెట్టలేదేమో.అయినాఆ స్మశానం వారికి ఆశ్రయం ఇవ్వడమే కాదు వారి ఆకలిని కూడా తీర్చింది .ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ స్మశానం “ఒడిశాలోని జయపురం డెప్పిగుడలో ఉంది .దాని పేరు ‘మణికర్ణిక స్వర్గద్వారం’ .మరి అసలు అంత మంది ఆ స్మశానం లో నే ఎందుకు ఉంటున్నారు దాని కధ ఏమిటి అంటే :నందపూర్, లమతాపుట్ సమితిలలో మారుమూలకొండలూ, అడవుల మధ్య ఉండే ఈగ్రామాల్లో ఉండేది ఎక్కువగా వెనుకబడిన తెగల వాళ్లే. చాలావరకువలస కూలీ లే, వారికి కూలి చేసుకోవడం తప్ప వేరే దారి లేదు .కానీ ఆ ప్రాంతంలో కూలి బాగా తక్కువ ,పోనీ పని కోసం పక్కనున్న పట్టణానికి వెళ్దామనుకుంటే అక్కడ అద్దె భరించడం కష్టంగా ఉండేది.. అలాంటి సమయంలో 2005-06లలో జయపురంలో “మణికర్ణిక స్వర్గద్వారాన్ని” నిర్మించడం మొదలు పెట్టారు తెలుగు ప్రజలు. ప్రహరీగోడ నిర్మించడానికి పట్టణంలో కూలీల కొరత ఏర్పడింది.అప్పుడే ఒకరోజు రాత్రి దగ్గర్లోని బంగళా అరుగుపై నిద్రపోతున్న ఈ కూలీల్ని చూశారు నిర్మాణ కమిటీ సభ్యులు. దగ్గరికెళ్లి ‘కూలి పనుంది వస్తారా’ అని అడగ్గా ‘శ్మశానంలో వసతి కల్పిస్తే వస్తామని చెప్పారు వాళ్లు. అలా వారికి చేయడానికి పని ఉండడానికి ఆశ్రయం రెండు కూడా దొరికాయి శ్మశానంలో అడుగు పెట్టిన కూలీల కు వసతులు బాగుండడం, పట్టణంలో అద్దె ఇళ్లలో ఉండే స్తోమత లేకపోవడంతో వాళ్లు అక్కడే ఉండిపోయారు అవును ఇప్పుడు ఆ స్మశానం ,వారికి స్వర్గధామమే..ఇదండీ స్వర్గధామం లాంటి ఓ స్మశానం కథ🔅