ఏప్రిల్‌తోనే కరోనా ఖతం.. ఇక అన్నీ శుభాలే: జ్యోతిష్య పండితులు

Spread the love

ఏప్రిల్‌తోనే కరోనా వైరస్ ఖతమని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అంతేకాకుండా మే నుంచి దేశానికి అన్నీ శుభ ఫలితాలే అంటున్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది కరోనా మహమ్మారి. ఇప్పటికే దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షా 20 వేల మందికి పైగా మరణించారు. ఇటు దేశ వ్యాప్తంగా కూడా 10 వేలు దాటాయి కరోనా పాజిటివ్ కేసులు. లాక్‌డౌన్‌ విధించిన తరువాత కూడా ఇవి పెరుగుతూనే ఉంటడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో మే 3వ తేదీవరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు ప్రధాని మోదీ.

అయితే జ్యోతిష్య పండితులు మాత్రం ఏప్రిల్‌ నుంచి ఈ కరోనా వ్యాప్తి తగ్గుతుందని అంటున్నారు. ఇందుకు కారణాలు కూడా చెబుతున్నారు.

2019లో డిసెంబర్‌లో సూర్యుడు, చంద్రుడు రాశిలో ఉన్నాడనీ.. ఆ గ్రహాల్ని రాహువు చూస్తుండటంతో పాటూ.. మకరరాశిలో శని, కుజ, గురువులు కలిసిపోవడం వల్ల.. ఇదివరకు ఎప్పుడూ జరగని దారుణ పరిస్థితులు ఏర్పడినట్లు వారు చెబుతున్నారు. నిజానికి గురు గ్రహం (మార్స్), శనిలు మకరరాశిలో ఉంటడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని అంటున్నారు. అందుకే మార్చి నెల సగం ముగిశాఖ.. శని, గురు గ్రహాలు కలయిన జరిగినప్పటి నుంచి ప్రభుత్వాలు తీసుకున్న కఠిన నిర్ణయాలు తీసుకొని.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాయని పేర్కొంటున్నారు.

గతంలో ఇలా ఫ్లూటో(యముడు), శని గ్రహాలు కలవడం వల్లనే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అలానే 1982లో ఇవి మరోసారి కలిసినప్పుడు ఎయిడ్స్ వచ్చింది. ఇప్పుడు 2019 డిసెంబర్‌లో ఈ రెండు గ్రహాలు కలవడం వల్లనే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినట్లు విదేశీ పండితులు చెబుతున్నారు. అయితే మార్చి 31వ తేదీన శని, మార్స్ గ్రహాన్ని కలిసిందని.. అందువల్ల ఏప్రిల్ మొదటి వారంలో వైరస్‌ సంఖ్య పెరిగినట్టు వారు పేర్కొంటున్నారు. అలాగే ఇప్పడు ఈ మార్స్, శనిలు దూరమవుతూ ఉండటం వల్లే కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు వారు లెక్కలు వేస్తున్నారు. ఏప్రిల్ నెల 14వ తేదీన సూర్యుడు మేషరాశిలోకి వెళ్లిపోవడం వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయని.. అందువల్ల మే నుంచి పరిస్థితులు బాగుంటాయని.. సెప్టెంబర్ 15 తర్వాత ఎలాంటి సమస్యలూ ఉండవని.. అన్నీ శుభాలే జరుగుతాయని పండితులు పేర్కొంటున్నారు.

Publisher: TV9 Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *