భారత గబ్బిలాల్లో కరోనా లక్షణాలు
గబ్బిలాలను చైనీయులు తినడం వలన వాటి నుంచి మనుషులకు కరోనా సంక్రమించిందని చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, గబ్బిలాలు అన్నవి ప్రతి దేశంలో ఉంటాయి. ఒక్కో దేశంలో ఉండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి వ్యాధి నిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో గబ్బిలాల పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరిలో నివసించే ఫ్లైయింగ్ ఫాక్స్, రౌసెటస్ వంటి గబ్బిలాలపై ఐసిఎంఆర్, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజి సంస్థలు పరిశోధనలు చేశాయి. ఈ రెండు జాతి గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. మిగతా జాతులకు సంబంధించిన గబ్బిలాల్లో వైరస్ లేకపోవడం విశేషం. ఈ రెండు జాతులే కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయని ఆ శాస్త్రవేత్తల రిపోర్ట్ లో బయటపడింది. ఈ గబ్బిలాల నుంచి వైరస్ మనిషికి సంక్రమించే అవకాశం ఉందా లేదా అనే దాని పై ప్రస్తుతం లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి.