మరో ప్రాణాంతక వ్యాధి ముంచుకొస్తోంది…

Spread the love

మొదటి మనిషి ఆఫ్రికా నుండి వచ్చాడంటారు.కానీ ఆ మనిషికొచ్చే చాలా ప్రాణాంతక వ్యాధులు కూడా ఆఫ్రికాదేశాల నుండే వస్తు న్నాయి అని తెలుస్తుంది . అలాంటి మరో వ్యాధే “మంకీపాక్స్”.ఈ వ్యాధి మొదట్లో ఆఫ్రికా దేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితమైపోయిందనుకున్నారు. కానీ ఈ వింత వ్యాధి ఇత‌ర దేశాలకు విస్త‌రిస్తోంది. దాని కోర‌లు క్ర‌మంగా చాసుకుంటూ వ్యాపిస్తుంది . . 🚨తాజాగా సింగ‌పూర్‌లో ఈ వ్యాధి. ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దీనితో ఆ దేశంలో క‌ల‌క‌లం పుట్టుకొచ్చింది.దాంతో ఆ దేశం వైద్య‌ప‌ర‌మైన అత్య‌వ‌స‌ర ఆదేశాలను జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది.ఇంతటి ప్ర‌మాద‌క‌ర‌మైన‌, అత్యంత అరుదుగా చెప్పుకొనే మంకీపాక్స్ కేసులు సింగ‌పూర్‌లో న‌మోదు కావ‌డం ప‌ట్ల అక్క‌డి ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. అన్ని ఆసుప‌త్రుల‌కు నిర్దుష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది.మ‌ధ్య, ప‌శ్చిమాఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వ్యాధిగ్ర‌స్తులు చాలామంది ఉన్నారు. కొన్నాళ్ల నుంచీ ఈ వ్యాధి పొరుగు దేశాల‌కు వ్యాప్తి చెంద‌లేదు.

వ్యాప్తి చెందే విధానం ; 👉 జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోకే ల‌క్ష‌ణం దీనికి ఉంది. వ్యాధుల బారిన ప‌డిన జంతువులు, ఎలుక‌ల నుంచి మంకీపాక్స్ మ‌నుషుల‌కు సోకుతుంద‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు.

👉అనారోగ్యానికి గురైన కొన్ని ర‌కాల వేట‌మాంసాన్ని తిన‌డం వ‌ల్ల కూడా ఇది వ్యాపిస్తుంద‌ని చెప్పారు. 🔅అత్యంత స‌మీపంలో ఉంటే- మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కూ సోకుతుంద‌ని చెబుతున్నారు.

🚨లక్షణాలు :జ్వ‌రం రావ‌డం, చ‌ర్మంపై బుడిపెల్లాంటివి ఏర్ప‌డ‌టం, దుర‌ద వంటివి ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు. దీనివ‌ల్ల న్యుమోనియా వస్తుందని, ప్రాణాలు పోవడానికి కారణమౌతుందని డాక్టర్లు ధృవీక‌రించారు.
👉మొదట ఈ వ్యక్తీ వద్ద రోగ సూచనలు :
నైజీరియా నుంచి సింగ‌పూర్‌కు వ‌చ్చిన ఓ వ్య‌క్తికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే అత‌ణ్ణి నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ఇన్ఫెక్ష‌న్ డిసీజెస్‌కు త‌ర‌లించామ‌ని, అత్య‌వ‌స‌ర విధానం కింద అత‌నికి చికిత్స అందిస్తున్నామ‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ఆ వ్య‌క్తి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వెల్ల‌డించింది.వ్యాధి పూర్తిగా న‌యం అయ్యేంత వ‌ర‌కూ అత‌ణ్ణి ఇంటికి పంపించ‌బోమ‌ని అన్నారు. పూర్తిగా న‌యం కాకుండానే ఇంటికి పంపించ‌డం వ‌ల్ల మంకీపాక్స్ ఇత‌రుల‌కు సోకే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారు .అన్ని దేశాలు అంత భయపడుతున్న,జాగ్రత్తపడుతున్న ఈ విచిత్ర వ్యాధి మన దేశానికి రాకూడదని కోరుకుందాం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *