చాలా ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నికేవ్వరు చిత్రంలో విజయశాంతి (lady amitabh bachchan) కీలకపాత్రలో నటించింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ..నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే…
కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం.
జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను “గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక” అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను.
అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా..
lady Super Star , lady amitabh bachchan లాంటి అభినందనలు పొందినా… ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను.
సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్ లోనే మెగాస్టార్ ద్వారా నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు.
“సరిలేరు నీకెవ్వరు” దర్శకుడు రావిపూడి గారితో పాటు… మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.