రవిప్రకాష్‌పై టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్‌పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితంగా చర్యలకు పాల్పడి ఏబీసీఎల్ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడినట్లు అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తుండగా.. ఓ భయంకరమైన ఆరోపణ వినబడుతుంది. మీడియా అండతో విదేశాల్లో అమ్మాయిలతో తిరిగినట్లు బలంగా ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగులను, పలువురు యువతులను వేదించినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. మొత్తమ్మీద రవిప్రకాశ్ ప్రముఖ మహిళా వ్యాపారవేత్తలను ప్రముఖ హీరోయిన్లను సైతం బ్లాక్ మెయిల్ కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం ఇదే విషయంలో శ్రీరెడ్డి కూడా రవిప్రకాష్ పై దారుణమైన విమర్శలు చేసింది. తనను గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడంటూ పలు స్క్రీన్ షాట్లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రవి ప్రకాశ్ ను అరెస్ట్ చేస్తే మొత్తం వ్యవహారాలన్నీ సాక్ష్యాధారాలతో సహా బయటపడే అవకాశం ఉంది.ఇది చూసినతర్వాత ఒకటే అనిపిస్తుంది..”ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ”అని.