తెలుగు భాషలో తొలి పదం ఇదే..

Spread the love

తెలుగు భాష చరిత్ర ఇది

తెలుగు  భాష ద్రావిడ వర్గమునకు చెందిన భాష.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు.            పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష క్రీ.పు2400 సంవత్సరాల నాటిది. తెలుగు భాష కు మూలపురుషులు యానాదులు. వారు శాతవాహన వంశపు రాజుల కు ముందువారు. కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారు. తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు.   క్రీస్తు శకం మొదటి శతాబ్దములో వారు రచించిన “గాథాసప్తశతి” అన్న  పద్య రచనలో తెలుగు పదాలు మొట్టమొదట  కనిపించాయి.             తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. ఆ శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం “నాగబు”

ఇది మొదటి తెలుగు పదము. దీనిని శాసనములలొ కనుక్కున్నారు. పరిశోధకులు దీనిని మొదటి తెలుగు భాషా పదంగా గుర్తించారు.

         ఈ పదం ఉన్న రాతిబండ అమరావతి స్తూపం దిబ్బలలో దొరికింది. ఇది ఒక వ్యక్తి పేరు. పురాతత్వ పండితులు కొందరు దీనిని “నాగ – బు” అని పద విభాగం చేసి, రెండూ వేరువేరు పాలీబాషా పదాలని అనుకున్నారు. కానీ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇది తెలుగుపదమని, నాగబు అనేది తెనుగు ప్రధమావిభక్తి ప్రత్యాయంతో ఉన్న నాగ అనే పదానికి సమానమైన పదమని, నాగంబు నాగము అనే నేటి రూపాల పూర్వస్వరుపమని స్పష్టంగా నిరూపించారు. నాగబు అంటే నాగము లేదా “పాము” అని అర్థం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *